మనుసుంటే మార్గం ఉంటుందని చాటాడు కేరళలోని ఓ 23 ఏళ్ల కుర్రాడు. కేరళ నుంచి కశ్మీర్ వరకు సైకిల్‌పై ప్రయాణించి, దేశం మొత్తం చూడాలన్న తన కలను నిజం చేసుకున్నాడు.
కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన నిధిన్.. జనవరి1న తన యాత్రను ప్రారంభించాడు. ఆ సమయంలో అతని వద్ద ఉన్నది రూ.170 మాత్రమే. ఆ కొద్దిపాటి డబ్బులతోనే ప్రయాణం మొదలుపెట్టి అతడు.. 66 రోజులపాటు, 4,300 కి.మీలు ప్రయాణించి, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి చేరుకున్నాడు. కొన్నిరోజులు అక్కడే ఉండి, అనంతరం అతడు మనాలీ-లేహ్ మార్గం గుండా.. కశ్మీర్‌కు చేరుకుని తన యాత్రను ముగించనున్నాడు.
అలా.. కోరికకు రెక్కలు
నిధిన్‌కు దేశమంతా పర్యటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. లాక్డౌన్లో ఉద్యోగం పోగొట్టుకున్న అతడికి తన కోరికను నిజం చేసుకునేందుకు అవకాశం చిక్కినట్లైంది. దాంతో.. అతడు వంద రోజుల్లోనే కేరళ నుంచి కశ్మీర్‌కు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇందుకోసం ఓ ద్విచక్రవాహన కోసం అతడు అన్వేషించాడు. అయితే.. పెట్రోల్ ధర భారం భరించలేనని భావించిన అతడు.. తన సోదరుడి సైకిల్‌ను ఎంచుకున్నాడు.
డీఎస్ఎల్ఆర్ను అమ్మేసి..
కానీ, ఆ సైకిల్‌ను వాడేందుకు నిధిన్ సోదరుడు అంగీకరించలేదు. దాంతో తన వద్ద ఉన్న డీఎస్ఎల్ఆర్ కెమెరాను అమ్మి, ఆ డబ్బులతో సైకిల్‌ను కొనుగోలు చేశాడు. దాంతో పాటు తన ప్రయాణానికి అవసరమైన చిన్నపాటి వస్తువులను తీసుకున్నాడు. తన సైకిల్‌కే ఓ గ్యాస్ స్టవ్నూ అమర్చుకున్నాడు.
టీ అమ్ముతూ..
రోజూ వంద కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తానని చెబుతాడు నితిన్. సాయంత్రాల్లో ఏదైనా పెట్రోల్ బంకుల వద్ద తన సైకిల్‌ను ఆపి, అక్కడకు వచ్చే వారికి టీ చేసి అమ్ముతానని చెప్పాడు. తద్వారా వచ్చిన డబ్బులను తన ప్రయాణ ఖర్చులుగా వినియోగించుకుంటానని అన్నాడు. ఇకరాత్రి సమయాల్లో పెట్రోల్ బంకుల వద్దే చిన్న క్యాంప్ వేసుకుని పడుకుంటానని తెలిపాడు.
వివిధ ప్రదేశాల్లో తాను కలిసే వ్యక్తులు.. తనకు ఎంతో మద్దతిస్తారని చెప్పాడు నిధిన్. కొంత మంది తన వద్ద టీ తాగకుండానే.. డబ్బులు ఇచ్చేవారని అన్నాడు. తాను ఫిల్మ్‌మేకర్, యాక్టర్ అవ్వాలనుకుంటున్నానని.. అందుకే, భారత్‌లోని వివిధ ప్రదేశాల్లోని సంస్కృతిని తెలుసుకుంటున్నానని నిధిన్ చెబుతున్నాడు. ఈ ప్రయాణం ద్వారా తన లాంటి డబ్బుల్లేని వారు కూడా సైకిల్‌పై దేశాన్ని చుట్టిరాగలననే సందేశం ఇవ్వాలనుకుంటున్నానని అంటున్నాడు.
ఇదీ చూడండి:మంచి మనసు చాటుకున్న సింధియా