ETV Bharat / bharat

కశ్మీర్​లో రెండో రోజూ ఎన్ఐఏ సోదాలు- ముగ్గురు అరెస్ట్ - కశ్మీర్ ఎన్ఐఏ

జమ్ముకశ్మీర్​లోని అనంతనాగ్ జిల్లాలో రెండో రోజూ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు, ఆదివారం సైతం ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ.. ఆ సోదాలకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

kashmir nia
కశ్మీర్ ఎన్ఐఏ
author img

By

Published : Jul 12, 2021, 9:42 PM IST

జమ్ముకశ్మీర్​లో వరుసగా రెండో రోజూ సోదాలను కొనసాగించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని రెండు ప్రదేశాల్లో సోదాలు చేసింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.

భారత్​లోని యువతలో ఉగ్రవాద భావాలు చొప్పించేందుకు ఐసిస్ ​ఉపయోగిస్తున్న 'వాయిస్ ఆఫ్ హింద్' పత్రికకు సంబంధించిన కేసులో ఈ సోదాలు జరిపింది ఎన్ఐఏ. స్థానికంగా నివసించే ఆకిబ్ అహ్మద్ సోఫీ(అలియాస్ నదీమ్), ముహమ్మద్ ఆరిఫ్ సోఫీ సోదరుల ఇంటిని తనిఖీ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అనంతరం, వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. మరోవైపు, గంజివారాలోని జియోగ్రాఫిక్ ప్రింటింగ్ ప్రెస్​ను రెయిడ్ చేసి ఆరిఫ్ హుస్సెన్ ఖాద్రీ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వివరించాయి. ఓ ల్యాప్​టాప్, పలు కీలక పత్రాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నాయి.

ఎన్ఐఏ ప్రకటన

ఆదివారం సైతం కశ్మీర్​లోని పలు చోట్ల ఎన్ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. యువతను ఉగ్ర భావజాలానికి ఆకర్షితులను చేసి భారత్​కు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారన్న ఆరోపణలతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికారికంగా వెల్లడించింది. ఉమర్ నిసార్, తన్వీర్ అహ్మద్ భట్, రమీజ్ అహ్మద్ లోన్​లను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వీరంతా అనంతనాగ్ జిల్లాకు చెందినవారేనని వెల్లడించింది. డిజిటల్ పరికరాలు, ఐసిస్ లోగో ఉన్న టీషర్టులను సీజ్ చేసినట్లు తెలిపింది.

NIA raids continue in Kashmir for second day
ఉమర్ నిసార్, తన్వీర్ అహ్మద్ భట్, రమీజ్ అహ్మద్ లోన్

ఇదీ చదవండి: ఐఎస్‌ఐఎస్‌ కుట్ర భగ్నం- ఐదుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.