NIA arrests PFI Master weapon Trainer : దేశం మొత్తం సంచలనం సృష్టించిన.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నంధ్యాలకు చెందిన కీలకమైన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. పీఎఫ్ఐలో చేరిన వారికి ఆయుధ శిక్షణ ఇస్తున్న మహ్మద్ యూనిస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుతో పాటు గత ఏడాది నుంచి ఇప్పటివరకు 16 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిపై హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు కీలక నిందితుడిని అరెస్టు చేశారు.
అమాయక ముస్లిం యువతను ప్రేరేపించి.. పీఎఫ్ఐలో చేరిన వారికి మారణాయుధాలతో దాడులు చేయడం వంటి వాటిపై శిక్షణను ఇస్తున్నారు. అదే విధంగా భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే విధంగా వారికి శిక్షణ మెలకువలు నేర్పుతుంటారు. పీఎఫ్ఐలో చేరిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ఆయుధాలు ఎలా వాడాలో.. తెలియజేసే ఆయుధ శిక్షకుడిగా పనిచేశాడు. ఈ పీఎఫ్ఐ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకి కీలకమైన నిందితుడు మహ్మద్ యూనిస్ పట్టుబడ్డాడు. నంద్యాలలో తన సోదరుడి ఇన్వర్టర్ దుకాణంలో పని చేసిన యూనిస్.. 2022 సెప్టెంబరులో సోదాలు చేసిన సమయంలో భార్యా పిల్లలతో పరారయ్యాడు.
PFI CASE In Telangana : ఇతని జాడ కోసం గాలిస్తున్న ఎన్ఐఏకు.. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోని బళ్లారికి పారిపోయినట్లు సమాచారం అందుకున్నారు. అక్కడ కావ్లా బజార్లో ఉంటూ బషీర్ అని పేరు మార్చుకుని.. నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఉగ్రమూకలకు ప్రత్యేక కోడ్ భాషలో సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
అక్కడ స్థానికంగా ప్లంబర్‌గా జీవనం సాగిస్తున్నట్లు ఎన్ఐఏకు పక్కా సమాచారం అందడంతో.. అక్కడకు వెళ్లిన కేంద్ర దర్యాప్తు సంస్థ యూనిస్‌ను అరెస్టు చేసింది. అతనిని విచారించగా మరో శిక్షకుడు పేరు బయటకు వచ్చినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి యువకులను తయారు చేసి.. కుట్రలకు పన్నాగం పన్నారని చెపుతున్నారు. షేక్ ఇలియాస్ అనే ఈ వ్యక్తి.. పరారీలో ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
Popular Front Of India : అక్కడ స్థానికంగా ప్లంబర్ జీవనం కొనసాగిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో కర్ణాటకలో నొస్సామ్ ను అరెస్ట్ చేశారు. అతనిని విచారించగా మరో శిక్షకుడు పేరు బయటకు వచ్చింది. తనతో కలిసి షేక్ ఇలియాస్ అనే మరో వ్యక్తి కూడా ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు విచారణలో ఎన్‌ఐఏ అధికారులకు వెల్లడించాడు. ప్రస్తుతం ఇలియాస్ పరారీలో ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
ఇవీ చదవండి :