NIA arrests al Qaeda operative: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆల్‌ఖైదా తీవ్రవాది తాహీద్ అహ్మద్ షాను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. నిందితుడు ఇటీవల లఖ్‌నవూలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధరించారు.
"జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాకు చెందిన తాహీద్పై గతేడాది జులైలోనే గోమతి నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆల్‌ఖైదా సంస్థలోకి యువతను తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడున్నాడన్న అభియోగాల మేరకు కేసు నమోదైంది." అని ఎన్ఐఏ పేర్కొంది.
అంతకుముందు ఎన్ఐఏ అధికారులు ఇదే కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఏజీహెచ్ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంలో తాహీద్ మాస్టర్ మైండ్ అని ఎన్ఐఏకు చెందిన ఓ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: 'హిజాబ్' వివాదం హింసాత్మకం- లాఠీ ఛార్జ్‌లు, రాళ్ల దాడులు