ETV Bharat / bharat

ఖలిస్థాన్​ ఉగ్రవాదిని అరెస్ట్​ చేసిన ఎన్​ఐఏ - Khalistani terrorist gurjeeth singh nijjar

సైప్రస్​లో తలదాచుకున్న ఖలిస్థాన్​ ఉగ్రవాది గుర్జీత్​ సింగ్​ నిజ్జర్​ను ఎన్​ఐఏ అరెస్ట్ చేసింది. భారత్​లో సిక్కు ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి కుట్ర చేస్తున్నాడనే ఆరోపణలతో.. సైప్రస్​ ప్రభుత్వం అతన్ని తమ దేశం నుంచి బహిష్కరించింది.

NIA arrests absconding Khalistani terrorist upon deportation from Cyprus
ఎన్​ఐఏ అదుపులో ఖలీస్థానీ ఉగ్రవాది..
author img

By

Published : Dec 23, 2020, 9:41 PM IST

Updated : Dec 23, 2020, 9:54 PM IST

ప్రత్యేక ఖలిస్థాన్​ రాష్ట్రం కోసం భారత్‌లో మళ్లీ సిక్కు ఉద్యమాన్ని ప్రేరేపించేందుకు యత్నించారనే కేసులో ఖలిస్థాన్​ ఉగ్రవాది గుర్జీత్‌ సింగ్‌ నిజ్జర్‌ను జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్​ఐఏ అరెస్టు చేసింది. 2017 నుంచి సైప్రస్‌లో దాక్కున్న నిజ్జర్‌ను భారత్‌కు రప్పించి దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఎన్​ఐఏ అదుపులోకి తీసుకుంది. సిక్కు ఉద్యమాన్ని ప్రేరేపించే ప్రయత్నాల్లో భాగంగా నిజ్జర్‌ మరో ఇద్దరు ఉగ్రవాదులు హర్‌పాల్‌ సింగ్, మొయిన్‌ ఖాన్‌లతో కలిసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లు ఎన్​ఐఏ తెలిపింది.

పంజాబ్‌ మాజీ సీఎం బియాంత్‌ సింగ్‌ను హత్య చేసిన ఉగ్రవాది జగ్తార్‌సింగ్‌ హవారను పొగడడం సహా ఖలిస్థాన్‌ ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు, 1984 ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు సంబంధించిన పోస్టులను పెడుతున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టుల ద్వారా సిక్కు యువత ఖలిస్థాన్​ ఉద్యమంలో చేరేలా ప్రయత్నించారని తెలిపింది.

ఇదీ చూడండి: మళ్లీ ఉగ్రవాదంవైపు కశ్మీరీ యువత- నెలకు 12మంది!

Last Updated : Dec 23, 2020, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.