NHPC Engineer Jobs 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) 98 ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు
- ట్రైనీ ఇంజినీర్ (సివిల్) - 22 పోస్టులు
- ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 17 పోస్టులు
- ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్) - 50 పోస్టులు
- ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) - 9 పోస్టులు
- మొత్తం పోస్టులు - 98
విద్యార్హతలు
NHPC Engineer Eligibility :
- ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ క్వాలిఫై అయ్యుండాలి.
- ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థులు సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అభ్యర్థులకు గేట్, సీఏ/సీఎంఏ స్కోర్ కూడా కచ్చితంగా ఉండి తీరాలి.
వయోపరిమితి
NHPC Engineer Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 22 నాటికి 30 ఏళ్లు మించి ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
NHPC Engineer Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.295 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్లకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం
NHPC Engineer Selection Process : గేట్, సీఏ/సీఎంఏ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. తరువాత వారి ధ్రువపత్రాలను పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
NHPC Engineer Salary : ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,00 వరకు జీతం అందిస్తారు.
దరఖాస్తు విధానం
NHPC Engineer Job Application Process :
- అభ్యర్థులు ముందుగా https://www.nhpcindia.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- Career సెక్షన్లోకి వెళ్లి Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- వెబ్సైట్లో మీ ఈ-మెయిల్, ఫోన్ నంబర్ నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- దీనితో మళ్లీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుమును కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
NHPC Recruitment 2024 Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 జనవరి 2
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 22
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు జాబ్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్
ఇంటర్, డిగ్రీ అర్హతతో RPFలో 2250 సబ్-ఇన్స్పెక్టర్ & కానిస్టేబుల్ ఉద్యోగాలు