నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో(NFC) ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. 124 పోస్టుల భర్తీకిగాను నోటిఫికేషన్‌ను విడుదల చేసింది NFC. ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి NFC దరఖాస్తులను కోరుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. NFC రిక్రూట్మెంట్ కోసం అప్లై చేయడానికి చివరి తేది 2023, ఏప్రిల్ 10. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.nfc.gov.in వెళ్లి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు
ఎన్ఎఫ్సీ 2023 సంవత్సరానికి గాను అధికారిక వెబ్సైట్ @nfc.gov.inలో 124 ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
చీఫ్ ఫైర్ ఆఫీసర్ | 01 |
టెక్నికల్ ఆఫీసర్ | 03 |
డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ | 02 |
స్టేషన్ ఆఫీసర్ | 07 |
సబ్ ఆఫీసర్ | 28 |
డ్రైవర్ పంప్ ఆపరేటర్ ఫైర్‌మెన్ | 83 |
మొత్తం పోస్టులు | 124 |
వేతనాల వివరాలు
పోస్టు పేరు | నెలవారి వేతనాలు |
చీఫ్ ఫైర్ ఆఫీసర్ | రూ.67,000 |
టెక్నికల్ ఆఫీసర్ | రూ.56,100 |
డిప్యూటి చీఫ్ ఫైర్ ఆఫీసర్ | రూ.56,100 |
స్టేషన్ ఆఫీసర్ | రూ.47,600 |
సబ్ ఆఫీసర్ | రూ.35,400 |
డ్రైవర్, పంప్ ఆపరేటర్, ఫైర్‌మెన్ | రూ.21,700 |
కేటగిరీ: ఇంజినీరింగ్ జాబ్స్
అధికారిక వెబ్సైట్: www.nfc.gov.in
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేది- 2023, మార్చి 11
- దరఖాస్తు ప్రారంభ తేది - 2023, మార్చి 11
- దరఖాస్తు చివరి తేది - 2023, ఏప్రిల్ 10
దరఖాస్తు విధానం
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ తన అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ @nfc.gov.inలో 124 ఖాళీల కోసం ఎన్ఎఫ్సీ రిక్రూట్మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఎన్ఎఫ్సీ నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హత గల అభ్యర్థులు www.nfc.gov.in ద్వారా ఏప్రిల్10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీకి ముందుగానే అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
అర్హత ప్రమాణాలు
అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు బీఈ/ బీటెక్/ ఏదేని డిగ్రీ/ డిప్లొమాను గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి
18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.
ఎంపిక విధానం
ఎన్ఎఫ్సీ ఉద్యోగానికి వివిధ దశలు పూర్తైన తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
డీఆర్డీవోలో ఉద్యోగ అవకాశాలు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బెంగళూరు అప్రెంటిస్ ట్రైనీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు గ్రాడుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్, ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్ ఇలా వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పై విభాగాలలో 150 పోస్టులకు గానూ దరఖాస్తులను కోరుతోంది. డీఆర్డీఓ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రతినెల రూ.9000 స్టైఫండ్‌గా పొందుతారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: