ETV Bharat / bharat

'శ్రీధామ్​ ఎక్స్​ప్రెస్'​కు బాంబు బెదిరింపు - shridham express bomb call

దిల్లీ హజ్రత్ నిజాముద్ధిన్​ రైల్వే స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్ జబల్​పుర్​ వెళ్తున్న రైలులో బాంబు ఉందని రైల్వే పోలీసులకు వచ్చిన ఫోన్​కాల్​ కలకలం రేపింది. వెంటనే రైలును హరియాణాలోని ఓల్డ్​ ఫరిదాబాద్​లో ఆపి మూడున్నర గంటల పాటు బాంబు స్వ్కాడ్​ బృందం తనిఖీలు చేపట్టింది. చివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

news-of-bomb-in-shridham-express-going-from-nizamuddin-to-jabalpur
'శ్రీధామ్​ ఎక్స్​ప్రెస్'​కు బాంబు బెదిరింపు
author img

By

Published : Dec 30, 2020, 5:20 AM IST

శ్రీధామ్​ ఎక్స్​ప్రెస్​లో ఓ తెల్ల బ్యాగ్​లో బాంబు ఉందని రైల్వే పోలీసులకు వచ్చిన ఓ ఫోన్​కాల్​ కలకలం రేపింది. దిల్లీలోని హజ్రత్​ నిజాముద్దిన్​ రైల్వే స్టేషన్​ నుంచి మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్ వెళ్తున్న ఎక్స్​ప్రెస్​ రైలును హరియాణాలోని ఓల్డ్ ఫరీదాబాద్​లో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా ఆపారు అధికారులు. బాంబు స్క్వాడ్​ బృందాలతో రైలులో తనిఖీలు నిర్వహించారు. కిందకు దిగిన ప్రయాణికుల లగేజ్​ బ్యాగులలో కూడా సోదాలు చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి రెైలులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధరించారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఫోన్​కాల్ కారణంగా రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

నిజాముద్దిన్ రైల్వే స్టెషన్​లో ఇద్దరు వ్యక్తులు.. రైలులో బాంబు పెట్టిన విషయంపై మాట్లాడుకుంటుండగా మూడో వ్యక్తి విని.. రైల్వే పోలీస్​ హెల్ప్​ లైన్​కు ఫోన్​ చేసి సమచారమిచ్చాడని అధికారిక వర్గాలు తెలిపాయి. వెంటనే రైలుని ఫరీదాబాద్​లో ఆపినట్లు పేర్కొన్నాయి. చివరకు అది నిజం కాదని తేలింది.

ఇదీ చూడండి: 'రజనీ ప్రకటన నన్నూ నిరాశపరిచింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.