ETV Bharat / bharat

వారి పెళ్లికి అనుకోని అతిథిగా సీఎం.!

వివాహ వేడుకకు స్థానిక నేతలు హాజరైతేనే ఎంతో గొప్పగా భావిస్తాం. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరైతే..? అదీ జోరు వానల మధ్యలో.. ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవమే తమిళనాడులోని చెన్నైలో ఓ జంటకు ఎదురైంది.

Newly wed couples in flood hit Chennai received surprise blessing from CM Stalin
కొత్త జంటతో ముచ్చటిస్తున్న సీఎం స్టాలిన్​
author img

By

Published : Nov 9, 2021, 6:51 AM IST

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​.. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులను అలర్ట్​ చేస్తూ.. ఎప్పటికప్పుడు తన మార్కు రాజనీతిని ప్రదర్శిస్తుంటారు. ప్రజలకు తానెప్పుడూ చేరువగా ఉంటానని నిరూపించేందుకు వారితో మమేకమవుతారు. ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.

Newly wed couples in flood hit Chennai received surprise blessing from CM Stalin
కొత్త జంటతో ముచ్చటిస్తున్న సీఎం స్టాలిన్​

భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమమ్యాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు సీఎం స్టాలిన్​ వెళ్లారు. ఈ సందర్భంగా అప్పుడే పెళ్లి అయిన నూతన వధూవరుల దగ్గరకు వెళ్లి ఆశీర్వదించి.. వారిని ఆశ్చర్యపరిచారు.

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న సీఎం స్టాలిన్​

గౌరీ శంకర్​, మహాలక్ష్మీ అనే జంట చెన్నైలోని కవియారాసు కన్నడసాన్​ నగర్​ ప్రాంతంలో ఉండే ఓ కళ్యాణమండపంలో పెళ్లి చేసుకున్నారు. ఇదే సమయంలో వరదలపై సమీక్షించేందుకని వెళ్తున్న సీఎం స్టాలిన్​ తన కాన్వాయ్​ను ఆపి, నడుచుకుంటూ ఫంక్షన్​ హాల్​ దగ్గరకు వెళ్లి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సుమారు 10 నిమిషాల పాటు అక్కడే ఉండి.. వారితో ఫోటోలు దిగి ముచ్చటించారు. అనుకోని అతిథి పెళ్లికి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

స్టాలిన్​ వరద ప్రభావిత ప్రాంతాలైన పోర్ట్​, రాయపురం, ఆర్​కే నగర్​, పెరంబూర్​ నియోజకవర్గాల్లో పర్యటించారు.

ఇదీ చూడండి: రూ.39 కోట్ల వ్యయంతో కరుణానిధి స్మారక చిహ్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.