ETV Bharat / bharat

పెళ్లి కాకుండానే తల్లైన యువతి.. బిడ్డ పుట్టగానే హత్య చేసి.. - నవజాత శిశువు మృతి

Newborn baby killed by mother: అప్పుడే పుట్టిన తన బిడ్డను హత్య చేసి మురికి కాలువలో పడేసిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు సహకరించిన ఆమె ప్రియుడు, అతని స్నేహితుడిని విచారిస్తున్నారు. ఈ సంఘటన కేరళలోని త్రిస్సూర్​ జిల్లాలో జరిగింది.

Newborn baby killed by mother
బిడ్డను హత్య చేసి మురికి కాలువలో పడేసి
author img

By

Published : Dec 22, 2021, 3:48 PM IST

Newborn baby killed by mother: పెళ్లి కాకుండానే తల్లి అయిన ఓ యువతి.. తన బిడ్డను హత్య చేసి ప్రియుడి సాయంతో మురికి కాలువలో పడేసింది. ఈ అమానవీయ సంఘటన కేరళలోని త్రిస్సూర్​ జిల్లాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను హత్య చేసిన 22 ఏళ్ల యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ జరిగింది..

పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. త్రిస్సూర్​లోని పుఝక్కల్​ బ్లాక్​కు చెందిన యువతి.. ప్రేమ పేరుతో ఓ వ్యక్తితో సన్నిహితంగా గడిపి, గర్భం దాల్చింది. ఆ విషయాన్ని దాచి పెట్టింది. కొందరు బంధువుల సాయంతో ఈనెల 18న శనివారం రాత్రి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ వెంటనే శిశువును హత్య చేసింది. శిశువు మృతదేహాన్ని మాయం చేయాలని తెల్లవారుజామున.. తన ప్రియుడికి ఇచ్చింది. అతను.. తన స్నేహితుడితో కలిసి చిన్నారి మృతదేహాన్ని ప్లాస్టిక్​ బ్యాగ్​లో పెట్టి పూన్​కున్నమ్​ ఎమ్మెల్యే రోడ్​లోని పరమెక్కవు శాంతి ఘాట్​ సమీపంలో మురికి కాలువలో పడేశాడు.

మురికి కాలువలో కుల్లిపోయిన శిశువు మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికంగా ఉండే సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే చిన్నారిని బ్యాగ్​లో పెట్టి పడేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు.

బుధవారం ఉదయం మహిళతో పాటు ఆమె ప్రియుడు, అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం. వారిని ప్రశ్నించిన తర్వాత అసలు నిజాలు తెలుస్తాయి' అని ఓ సీనియర్​ పోలీస్​ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: 'ఫొటోలతో బ్లాక్​మెయిల్​'.. యువకుడిని హత్య చేయించిన పదో తరగతి బాలికలు

కుక్క పేరు తెచ్చిన తంట.. మహిళ ఒంటికి నిప్పంటించి..

టాటూ కోసం వచ్చి 'హనీ ట్రాప్'- రూ.20లక్షలు డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.