ETV Bharat / bharat

అల్జీమర్స్​కు మందు కనిపెట్టిన ఉత్తరాఖండ్​ డాక్టర్​ - ఎఫ్​టీడీ

అల్జీమర్స్​(మతిమరుపు) వ్యాధికి మందు కనిపెట్టారు ఉత్తరాఖండ్​కు చెందిన డాక్టర్​ తారిక్​ అఫ్రోజ్​. ప్రస్తుతం ఆ ఔషధంపై స్విట్జర్లాండ్​లో క్లినికల్​ పరీక్షలు జరుగుతున్నాయి. అల్జీమర్స్​, ఏఎల్​ఎస్​, ఎఫ్​టీడీ వంటి వాటికి ఇప్పటి వరకు ఔషధాలు లేవు. డాక్టర్​ తారిక్​ ఆవిష్కరణలతో ఈ వ్యాధుల చికిత్సలో కీలక ముందడుగు పడింది.

medicine for Alzheimer's
అల్జీమర్స్​కు మందు కనిపెట్టిన ఉత్తరాఖండ్​ డాక్టర్​
author img

By

Published : Jan 10, 2022, 10:59 AM IST

అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు పలువురు భారతీయులు. ఉత్తరాఖండ్​, రూర్కీకి చెందిన డాక్టర్​ తారిక్​ అఫ్రోజ్​.. అల్జీమర్స్​, ఎఫ్​టీడీ, ఏఎల్​ఎస్​ వంటి నయం చేయలేని వ్యాధులకు సరికొత్త ఔషధాన్ని రూపొందించి భారత్​ గర్వపడేలా చేశారు.

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్​ హాకింగ్​ అమిట్రోఫిక్​ లేటరల్​ స్క్లేరోసిస్​(ఏఎల్​ఎస్​​) బారినపడి.. కుర్చీకే పరిమితమయ్యారు. ఈ వ్యాధితో శరీరం పక్షవాతానికి గురవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 22 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్జీమర్స్​, ఎఫ్​టీడీ వ్యాధులు మనిషి మెదడును పూర్తిగా నాశనం చేస్తాయి. ఒక్క అమెరికాలోనే 50 లక్షల మంది అల్జీమర్స్​ బాధితులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది ఎఫ్​టీడీతో బాధపడుతున్నారు.

ఇప్పటి వరకు ఆ వ్యాధులకు చికిత్స లేదు. ఈ క్రమంలో డాక్టర్​ తారిక్​ అఫ్రోజ్​.. ఆవిష్కరణలతో కీలక ముందడుగు పడింది. మందే లేదనుకున్న ఈ వ్యాధులను నయం చేసే ఔషధాన్ని రూపొందించారు తారిక్​. 2020, నవంబర్​లో తాను కనుగొన్న ఔషధానికి పేటెంట్​ పొందారు​. ప్రస్తుతం ఈ మందుపై స్విట్జర్లాండ్​లో క్లినికల్​ ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఐఐటీ ముంబయిలో పీజీ చేసిన తర్వాత ఈటీహెచ్​ వర్సిటీలో పీహెచ్​డీ చేసేందుకు 2007లో స్విట్జర్లాండ్​ వెళ్లారు తారిక్​. అప్పటి నుంచి పలు పరిశోధనల్లో పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తన కుమారుడు కృషి చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు తారిక్​ తండ్రి. శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి గల యువతకు తన కుమారుడు స్ఫూర్తిగా నిలుస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:

మత్తు మాయలో యువత- మాఫియా గుప్పిట్లోకి రాష్ట్రాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.