జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు(amit shah jammu kashmir news). అక్కడి సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు.
మూడు రోజుల జమ్ముకశ్మీర్ పర్యటనలో(amit shah kashmir visit) ఉన్న షా.. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లను కలిశారు. సైనికులు.. ఆందోళనలు లేకుండా దేశాన్ని రక్షించాలని.. వారి కుటుంబసభ్యుల క్షేమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసుకుంటుందని హామీనిచ్చారు. జవాన్ల కోసం కానుకలు కూడా తీసుకెళ్లారు



"భద్రతా దళాల ధైర్యసాహసాలకు దేశ ప్రజల తరఫున నేను సెల్యూట్ చేస్తున్నా. కృతజ్ఞతలు తెలుపుతున్నా. సరిహద్దులను రక్షిస్తున్న మీకు, మీ కుటుంబాల సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరు ఎలాంటి ఆందోళనలు లేకుండా దేశాన్ని రక్షించండి. మీ కుటుంబాలను మోదీ ప్రభుత్వం చూసుకుంటుంది."
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
సరిహద్దులోని చివరి గ్రామమైన మక్వాల్‌ను కూడా షా సందర్శించారు(amit shah news). సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అక్కడి ప్రజలకు వెల్లడించారు. దేశ రాజధాని దిల్లీలో నివాసముంటున్న ప్రజలకు ఎన్ని హక్కులున్నాయో.. వాటికి సమానంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు కూడా హక్కులు ఉన్నాయని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో మొదలైన అభివృద్ధికి ఎవరూ అడ్డుపడలేరని అభిప్రాయపడ్డారు.


షా వెంట ఎల్జీ మనోజ్ సిన్హా కూడా సరిహద్దు గ్రామానికి వెళ్లారు.
'మోదీ వల్లే సాధ్యమైంది..'
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 'వివక్షపూరిత' ఆర్టికల్ 370 రద్దు మోదీ వల్లే సాధ్యమైందని అమిత్ షా వ్యాఖ్యానించారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలను సాకారం చేసేందుకు నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టి పనిని పూర్తి చేశారన్నారు.
2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకలో తొలిసారి బహిరంగ సభ నిర్వహించారు షా. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య విలువలను మోదీ పునరుద్ధరించారని, జమ్ముకశ్మీర్ ప్రజల అభివృద్ధిలో నూతన శకాన్ని మొదలు పెట్టారని ప్రశంసించారు.
ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించడంలో భాజపా పాత్ర ఎంతో ఉందని కొనియాడారు షా. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ, బ్లాక్, జిల్లా అభివృద్ధి కౌన్సిల్ పోలింగ్‌ను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు.
జమ్ముకశ్మీర్(Amit Shah Kashmir Visit) పర్యటనలో భాగంగా.. ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జమ్మూలో ఐఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన అమిత్ షా.. అక్కడ మొక్క నాటారు. జమ్మూలో ఎంపీలు, భాజపా నేతలతో ఆయన భేటీ కానున్నారు. డిజియానాలో గురుద్వారాను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లో 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా తెలిపారు. 2022 చివరి నాటికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో యువత భాగమైతే.. ఉగ్రవాదుల వ్యూహం దెబ్బతింటుందని చెప్పారు
సోమవారం కూడా హోం మంత్రి జమ్ముకశ్మీర్‌లో పర్యటనను కొనసాగించనున్నారు.
ఇవీ చూడండి:- జమ్ముకశ్మీర్ భద్రతపై అమిత్ షా సమీక్ష