ETV Bharat / bharat

'ఈశాన్యం'లో క్యాన్సర్​ గుబులు- పెరగనున్న కేసులు - మణిపుర్​లో క్యాన్సర్​ బాధితులు

రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో క్యాన్సర్​ కొత్త కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2025 నాటికి అక్కడ 57,131 కొత్త కేసులు నమోదవుతాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) అంచనా వేస్తోంది.

cancer cases in northeast states
ఈశాన్య రాష్ట్రాల్లో పెరగనున్న క్యాన్సర్​ బాధితులు!
author img

By

Published : Feb 4, 2021, 7:14 PM IST

Updated : Feb 4, 2021, 7:27 PM IST

ఈశాన్య భారతంలో రానున్న రోజుల్లో క్యాన్సర్​ బారిన పడే వారి సంఖ్య భారీగా పెరగనుంది. 2025 నాటికి 57,131 కొత్త క్యాన్సర్​ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​), బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్​​​ డిసీజ్​ ఇన్​ఫర్మేటిక్స్​ అండ్​ రీసెర్చ్​(ఎన్​సీడీఐఆర్​) సంస్థలు విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. ప్రపంచ క్యాన్సర్​ దినం సందర్భంగా గురువారం ఈ వివరాలను వెల్లడించాయి. 2020లో క్యాన్సర్​ కేసుల సంఖ్య అక్కడ 50,317గా ఉన్నట్లు ఐసీఎంఆర్​ అంచనా వేసింది.

11 జనాభా ఆధారిత క్యాన్సర్​ రిజిస్ట్రీస్​(పీసీబీసీఆర్​), 7 ఆసుపత్రి ఆధారిత క్యాన్సర్​ రిజిస్ట్రీస్​(హెచ్​బీసీఆర్​)ల సమాచారం ఆధారంగా ఈ నివేదికను పొందుపర్చామని ఐసీఎంఆర్​ తెలిపింది. ఆరోగ్య రంగంలో భవిష్యత్​లో తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలకు ఈ నివేదిక.. మార్గదర్శకత్వం కానుందని ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్​ బలరామ్​ భార్గవ పేర్కొన్నారు.

నివేదికలోని కీలక అంశాలు..

  • మణిపుర్,​ సిక్కిం​ రాష్ట్రాలు మినహా.. మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువగా క్యాన్సర్​ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
  • పురుషులు ఎక్కువగా క్యాన్సర్​ బారిన పడే అవకాశాలు మిజోరాంలోని ఐజ్వాల్​ జిల్లాలో ఉన్నాయి. అక్కడ 269.4 శాతం పురుషులు క్యాన్సర్​ ధాటికి గురవుతారని అంచనా.
  • మహిళలు(219.8 శాతం) ఎక్కువగా క్యాన్సర్​ బారిన పడే అవకాశాలు అరుణాచల్​ ప్రదేశ్​లోని పుపుంపరే జిల్లాలో ఉన్నాయి.
  • పొగాకు వల్ల క్యాన్సర్​ వచ్చే అవకాశం.. పురుషుల్లో 49.3 శాతం, మహిళల్లో 22.8 శాతం.

8 ఈశాన్యరాష్ట్రాల్లోనూ మహిళల కంటే పురుషుల్లోనే బ్లడ్​ షుగర్​ లెవల్స్​ అధికంగా ఉన్నాయని నివేదిక చెబుతోంది.

ఇదీ చదవండి:క్యాన్సర్‌ అంటే ఏంటి? నివారణ మార్గాలేంటి?

Last Updated : Feb 4, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.