సరిహద్దు దాటి నేపాల్‌లోకి వెళ్లిన ముగ్గురు భారతీయులపై అక్కడి పోలీసులు కాల్పులు జరపడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరొకరు గాయపడ్డారు. నేపాల్‌లో జరిగే ఓ జాతరలో పాల్గొనడానికి వారు వెళ్లినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు చెబుతుండగా, నేపాల్ పోలీసులు మాత్రం వారు తమ దేశంలోకి మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీని అక్రమంగా చేరవేయడానికి వచ్చినట్లు పేర్కొంటున్నారు.
"భూమిదాన్ రాఘవ్‌పురి టిల్లా చార్ గ్రామానికి చెందిన గోవింద సింగ్, పప్పూ సింగ్, గుర్మీత్ సింగ్ అనే యువకులు గురువారం సరిహద్దును దాటి నేపాల్‌లోని కాంచన్‌పుర్ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులతో గొడవ జరగడం వల్ల వారు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గోవింద సింగ్ తీవ్రంగా గాయపడటం కారణంగా నేపాల్ పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడం వల్ల ప్రాణాలు వదిలారు. పప్పూ సింగ్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి" అని ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ జిల్లా ఎస్పీ జైప్రకాశ్ యాదవ్ చెప్పారు.
ఇదీ చూడండి: ట్రాన్స్‌జెండర్లు రక్తదానం చేయొద్దా?