ETV Bharat / bharat

ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీల పాట్లు- మళ్లీ ఓలీనే ప్రధాని? - కొత్త ప్రభుత్వం

నేపాల్​లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు విధించిన గడువు గురువారం రాత్రి 9 గంటలతో ముగియనుంది. గడువు సమీపిస్తున్నప్పటికీ పార్టీల మద్దతు కూడగట్టటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. ఈ తరుణంలో రాజ్యాంగంలోని ఆర్టికల్​ 76(2), 76(3)ను వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. మళ్లీ ఓలీకే ప్రధాని అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Nepal parties
నేపాల్​, ఓలి
author img

By

Published : May 13, 2021, 4:48 PM IST

నేపాల్​లో ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాస పరీక్షలో ఓడిపోవడం వల్ల కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలకు గురువారం వరకు గడువిచ్చారు రాష్ట్రపతి విద్యా దేవి భండారీ. అయితే.. గడువులోపు ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్దతు కూడగట్టటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ప్రధాన పార్టీలు.

పార్టీ బాధ్యులతో మంగళవారం సమావేశమైన నేపాలీ కాంగ్రెస్​ అధినేత షేర్ బహదూర్​ దేవ్​బా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆయన ఆశలకు గండిపడినట్లు తెలుస్తోంది. జనతా సమాజ్​వాది పార్టీ(జేఎస్​పీ-ఎన్​)లోని మహంత ఠాకూర్ వర్గం​.. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో తాము పాల్గొనబోమని ప్రకటించింది. నేపాల్​ ప్రతినిధుల సభలో ఠాకూర్​ వర్గానికి 16 స్థానాలు ఉన్నాయి.

మ్యాజిక్​ ఫిగర్​కు 11 స్థానాల దూరంలో..

ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్​కు 61, మిత్రపక్షం, పుష్ప కమల్​ దాహల్​ 'ప్రచండ' నేతృత్వంలోని నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ మవోయిస్టు సెంటర్​(సీపీఎన్​-ఎంసీ)కు 49 సీట్లున్నాయి. వారికి ఉపేంద్ర యాదవ్​ నేతృత్వంలోని జనతా సమాజ్​వాది పార్టీకి 15 మంది సభ్యులు మద్దతు ఇస్తున్నారు. మొత్తంగా 125 సభ్యుల మద్దతు అవుతుంది. 271 స్థానాలున్న ప్రతినిధుల సభలో మ్యాజిక్​ ఫిగర్​ 136 అందుకునేందుకు ఇంకా 11 మంది మద్దతు కావాలి.

రాత్రి 9 గంటల వరకు గడువు

ప్రభుత్వ ఏర్పాటు కోసం తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో గురువారం రాత్రి 9 గంటల లోపు తనను కలవాలని రాష్ట్రపతి విద్యా దేవి స్పష్టం చేశారు.

ఆర్టికల్​ 76(2), 76(3) ఏం చెబుతున్నాయి?

ప్రధాని ఓలీ.. విశ్వాస పరీక్షలో ఓడిపోయిన తర్వాత.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రాజ్యాంగంలోని ఆర్టికల్​ 76(2)ను ఉపయోగించాలని ఎన్​సీ, సీపీఎన్​-ఎసీ, యాదవ్​ నేతృత్వంలోని జేఎస్​పీ వర్గం రాష్ట్రపతిని కోరాయి. ప్రతినిధుల సభలో ఏ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీని చూపించలేకపోయినప్పుడు.. ఈ ఆర్టికల్​ ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీల మద్దతు ఉన్న నేతను ప్రధానిగా రాష్ట్రపతి నియమించొచ్చు. ఒకవేళ.. గడువులోగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీల మద్దతు ఎవరూ కూడగట్టలేకపోతే.. ఆర్టికల్​ 76లోని సబ్​ క్లాజ్​ 3 ప్రకారం అతిపెద్ద పార్టీ నుంచి మైనారిటీ ప్రధాని కోసం పేరును సూచించాలని పార్టీలను ఆహ్వానిస్తారు రాష్ట్రపతి.

అలా జరిగితే.. 121 సీట్లు ఉన్న ఓలీ.. మరోమారు ప్రధాని పదవి కోసం అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగి ఓలీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టినట్లయితే... 30 రోజుల్లో మెజారిటీ సాధించి విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది.

రాజకీయ సంక్షోభం..

గతేడాది డిసెంబర్ 20న నేపాల్ ప్రతినిధుల సభను ఓలీ సూచన మేరకు రాష్ట్రపతి విద్యా దేవి భండారీ రద్దు చేయడం వల్ల ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అనంతరం ఏప్రిల్​ 30, మే 10 ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. ఓలీ, ప్రచండ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరి ఈ పరిస్థితులు తలెత్తాయి. అయితే సభను అర్థాంతరంగా రద్దు చేయడాన్ని నేపాల్ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మళ్లీ పునరుద్ధరించింది. మే 10న జరిగిన విశ్వాస పరీక్షలో ఓలీ నేతృత్వంలోని సీపీఎన్​-యూఎంఎల్​​ ఓడిపోయింది. ఓలీకి అనుకూలంగా 93 ఓట్లు రాగా.. 124 మంది సభ్యులు వ్యతిరేకించారు.

ఇవీ చూడండి: బలపరీక్షలో ఓడిన నేపాల్ ప్రధాని ఓలీ

నేపాల్​లో కమ్యునిస్టు పార్టీల ఏకీకరణ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.