NEET PG Medical Counselling 2023 : నీట్ (NEET 2023) పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో ఎంసీసీ (మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్‌లో సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థుల అర్హత మార్కులను సున్నా (0)గా పేర్కొంది. ఈ తగ్గింపు అన్ని కేటగిరీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇదివరకటి కటాఫ్ మార్కులను.. సున్నాకు తగ్గించిన నేపథ్యంలో మూడో రౌండ్‌లో సీట్ల కోసం విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counseling Committee) వెల్లడించింది.
NEET PG Medical Counselling 3rd Round 2023 : ఈ క్రమంలోనే పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌లో సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఎంసీసీ పేర్కొంది. ఆప్షన్లను మాత్రం మార్చుకునే అవకాశం కల్పించినట్లు తెలిపింది. కటాఫ్ మార్కులను తొలగించిన కారణంగానే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామని స్పష్టం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను '0'కు తగ్గించామని వివరించింది.
NTA Exam Calendar 2024 : ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్ రిలీజ్.. JEE, నీట్ ఎప్పుడంటే..
NEET PG Medical Counselling 3rd Round Cut Off Marks : ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్ పీజీ కౌన్సెలింగ్ (NEET PG Counselling 2023)కు కటాఫ్ మార్కులను 291గా, దివ్యాంగులకు 274, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257గా పేర్కొని మొదటి రెండు రౌండ్‌లలో కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు. తాజాగా మూడో రౌండ్‌లో అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు (విద్యార్థులు నీట్ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు) పొందినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లుగా నిబంధనలు మార్చారు.
భారీగా ట్రాఫిక్ జామ్.. తల్లితో కలిసి నీట్ అభ్యర్థి పరుగు.. అయినా ఆలస్యంగానే..
అందుబాటులో 13000 పైగా సీట్లు..: దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో కొన్ని పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదని వైద్య విద్య నిపుణులు తెలిపారు. ఫిజియాలజీ, పారా క్లినికల్, బయో కెమిస్త్రీ, అనాటమీ సహా పలు పీజీ కోర్సుల సీట్లు ఖాళీగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మొదటి 2 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత మూడోరౌండ్‌కు సీట్లు భారీగా మిగిలాయని స్పష్టం చేశారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌కు మొత్తం 13 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. 2023 సంవత్సరానికి గాను దాదాపుగా 2.09లక్షల మంది అభ్యర్థులు నీట్-పీజీ ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే వారికి మార్చి 5న నీట్-పీజీ పరీక్ష నిర్వహించారు. జులై 15న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొదటి రెండు రౌండ్ల సీట్ల ఎంపికలు పూర్తి కాగా.. తాజాగా మూడో రౌండ్ సీట్ల ఎంపిక చేస్తున్నారు.
9 Medical Colleges opening Telangana 2023 : ఒకే రోజు.. 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
యథాతథంగా నీట్-పీజీ పరీక్ష.. వాయిదా వేయడం కుదరదన్న సుప్రీంకోర్టు