ETV Bharat / bharat

NEET PG Exam: మే 21న నీట్​ పీజీ ఎంట్రన్స్​ - నీట్ పీజీ పరీక్ష వార్తలు

NEET PG Exam: నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్షమే 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల బోర్డు ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని పరీక్షల బోర్డును కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.

NEET PG Exam
NEET PG Exam
author img

By

Published : Feb 5, 2022, 5:11 AM IST

NEET PG Exam: నీట్​ పీజీ ప్రవేశ పరీక్ష మే 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల బోర్డు శుక్రవారం తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఈ పరీక్ష జరగాలి. అయితే నీట్​ 2021 కౌన్సెలింగ్​ ఇదే సమయంలో ఉన్నందున.. పీజీ పరీక్షను 6-8 వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారమే పరీక్షల బోర్డును కోరింది. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.

చివరి తేదీ పొడిగింపు

ఆన్​లైన్​లోనే నీట్ పరీక్ష దరఖాస్తూ సమర్పించేందుకు ఈనెల 4 వరకు ఉన్న గడువు కూడా మార్చి 25 వరకు పెంచారు. నీట్​ పీజీ పరీక్ష మే నాటికి వాయిదా వేయడం వల్ల ప్రస్తుతం ఇంటర్న్​షిప్​ చేస్తున్న ఎంబీబీఎస్​ విద్యార్థులు కూడా ఆ పరీక్షకు హాజరయ్యే అవకాశం వచ్చిందని వైద్య విద్య అసిస్టెంట్​ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ బీ శ్రీనివాస్​ చెప్పారు.

నీట్​ మాకొద్దంటూ.. డీఎంకే డిమాండ్​

నీట్​ నుంచి తమిళనాడును మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లును అక్కడి గవర్నర్​ వెనక్కు పంపడంపై డీఎంకే సభ్యులు శుక్రవారం రాజ్యసభలో నిరసన తెలిపారు. వీరికి కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ సభ్యులు మద్దుతు పలికారు. డీఎంకే సభ్యులు ఈ సమస్యను జీరో అవర్​లో లేవనెత్తగా.. ఛైర్మన్​ ఎం వెంకయ్యనాయుడు తిరస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ విషయాన్ని ప్రస్తావించుకోవచ్చని ఛైర్మన్​ సూచించినా.. సభ్యులు వినిపించుకోలేదు. నిరసన కొనసాగించిన సభ్యులు.. అనంతరం వాకౌట్​ చేశారు.

ఇదీ చూడండి: స్టాలిన్‌ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రా విద్యార్థి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.