ETV Bharat / bharat

సర్కార్​కు షాక్​- 3,000 మంది వైద్యుల రాజీనామా - 3000మంది వైద్యుల రాజీనామా

మధ్య ప్రదేశ్​లో దాదాపు 3,000మంది వైద్యులు రాజీనామా చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు.

nearly-3000-doctors-have-resigned-in-madhya-pradesh
3,000 మంది వైద్యుల రాజీనామా
author img

By

Published : Jun 4, 2021, 1:37 PM IST

మధ్యప్రదేశ్​లో ఆరోగ్య వ్యవస్థ కుంటుపడి పోయిందని ఆరోపిస్తూ రెవాలోని శ్యామ్‌షా వైద్య కళాశాలకు చెందిన 178మంది వైద్యులు రాజీనామా చేశారు. మరోవైపు అదే కాలేజీకి చెందిన 400మంది వైద్యుల్ని యాజమాన్యం తొలగించింది.

కాగా.. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా వివిధ వైద్యకళాశాలలకు చెందిన 2,500 మంది జూనియర్​ డాక్టర్లు రాజీనామా చేశారు. ఉపకార వేతనం పెంపు సహా.. వివిధ డిమాండ్లను ప్రభుత్వం తీర్చడం లేదని వారు ఆరోపించారు. గురువారం సాయంత్రం శ్యామ్‌షా వైద్య కళాశాల వద్ద వందలాది మంది జూనియర్ వైద్యులు గుమిగూడి, కొవిడ్-19 క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు నివాళులు అర్పించారు.

కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ డిమాండ్లను అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని వైద్యులు అన్నారు. తమ డిమాడ్లంను వెంటనే నెరవేర్చాలని సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.