దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల్లో బుధవారం భారీ పెరుగుదల కన్పించింది. కొత్తగా 42,015 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అంతకుముందురోజు 374గా ఉన్న కొవిడ్ మృతుల సంఖ్య.. బుధవారం ఏకంగా 3,998కి పెరిగింది.
అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా సమాచారాన్ని 14వ సారి సవరించడం వల్లే ఈ స్థాయిలో బుధవారం మరణాల సంఖ్య నమోదైంది. ఆ రాష్ట్రం వెల్లడించిన మృతుల సంఖ్య 3,509, కేసుల సంఖ్య 2,479గా ఉంది. ఫలితంగా దేశంలో కొత్త మరణాల సంఖ్య 3,998కి చేరింది. మరోవైపు కొత్తగా 36,977 మంది వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు: 3,12,16,337
- మొత్తం మరణాలు: 4,18,480
- కోలుకున్నవారు: 3,03,90,687
- యాక్టివ్ కేసులు: 4,07,170
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం క్రియాశీల రేటు 1.30 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది.
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 41,54,72,455 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 34,25,446 డోసులు అందించినట్లు తెలిపింది.
మంగళవారం 18,52,140 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
ప్రపంచంలో కొవిడ్ కేసులు..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 5,10,978 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 8,283 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,22,29,177కు చేరగా.. మరణాల సంఖ్య 41,33,340కు పెరిగింది.
కొత్త కేసులు..
- అమెరికా- 44,232
- బ్రెజిల్- 27,896
- ఫ్రాన్స్- 18,181
- బ్రిటన్- 46,558
- రష్యా- 23,770
ఇవీ చూడండి: