ETV Bharat / bharat

అతడి కోసం పోలీస్ ​స్టేషన్​ను పేల్చేసిన నక్సల్స్

ఝార్ఖండ్​, గుమ్లా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్​ భవనాన్ని(Kurumgarh Police Station Blast) బాంబుతో పేల్చేశారు. ఇటీవల అరెస్టైన నక్సల్ అగ్రనేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

naxalites
పోలీస్​స్టేషన్​పై బాంబు దాడి
author img

By

Published : Nov 26, 2021, 2:23 PM IST

ఝార్ఖండ్ గుమ్లా జిల్లా కురుమ్​గఢ్​లో ఇటీవల నిర్మించిన పోలీస్ స్టేషన్​ భవనాన్ని(Kurumgarh Police Station Blast) పేల్చేశారు మావోయిస్టులు. మూడు రోజుల బంద్​(నవంబరు 23-25) చివరి రోజున.. గురువారం ఠాణాపై బాంబుతో దాడిచేశారు. స్టేషన్​లో పోలీసులు లేని సమయంలో ఈ దాడికి పాల్పడ్డారు. మావోయిస్టు అగ్రనేతలను అరెస్ట్ చేయడానికి ప్రతీకారంగా దాడి చేశామని నక్సల్స్ ప్రకటించారు. ఈ మేరకు ఘటనాస్థలిలో ఓ కరపత్రాన్ని ఉంచి వెళ్లారు​.

naxalites blew up police station
నక్సల్స్ బాంబు​ దాడిలో ధ్వంసమైన పోలీస్ స్టేషన్​

అరెస్టులకు వ్యతిరేకంగా..

మావోయిస్టు పోలిటికల్​ బ్యూరో సభ్యులు.. ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్​ దా(prashant bose alias kishanda), అతని భార్య నారీ ముక్తి సంఘ్ నాయకురాలు షీలా మరందీని నవంబరు 12న సరాయ్​ఖెలాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ.. ఝార్ఖండ్​తో పాటు, బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో మూడు రోజులపాటు బంద్​ ప్రకటించారు మావోయిస్టులు. అరెస్ట్​ చేసిన ప్రశాంత్​ బోస్, షీలాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

naxalites
మావోయిస్టుల కరపత్రం

70 నక్సల్స్ దాడుల్లో..

ప్రశాంత్ బోస్​.. మావోయిస్టుల్లో సీనియర్ నాయకుడు. దాదాపు 70 నక్సల్స్ దాడుల్లో ఆయన పాత్ర ఉంది. షీలా మరందీ మావోయిస్టుల అపెక్స్ సెంట్రల్ కమిటీ సభ్యురాలు. అంతేకాక నారీ ముక్తి సంఘ్​ సంస్థకు అధినేత్రిగా పనిచేశారు. ఇప్పటికే వారిని రకరకాల దర్యాప్తు సంస్థలు 150 సార్లు విచారించారు. భద్రతా దృష్ట్యా అరెస్ట్ చేసిన ప్రశాంత్​ బోస్​ను సరాయ్​ఖెలా నుంచి రాంచీలోని హోట్వార్​ జైలుకు తరలించారు.

ఇదీ చూడండి: నది ఒడ్డున బట్టలు, సైకిళ్లు.. ఏంటా అని చూస్తే ఆ ముగ్గురు శవాలై...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.