ETV Bharat / bharat

చేతిలో పేలిన ఐఈడీ.. నక్సలైట్ మృతి - ఉత్తర బస్తర్ డివిజన్​

ఛత్తీస్​గఢ్​లోని నక్సలైట్​ ప్రభావిత ప్రాంతమైన బస్తర్​లో​ బాంబులు అమర్చుతుండగా నక్సలైట్ మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఐఈడీని అమర్చారు నక్సలైట్లు.ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. చనిపోయిన నక్సలైట్​ని అమరవీరునిగా ప్రకటించారు మావోయిస్టు పార్టీ నేతలు.

Naxalite killed by its own bomb, was planting a bomb for the force
చేతిలో పేలిన ఐఈడీ.. నక్సలైట్ మృతి
author img

By

Published : Feb 27, 2021, 3:58 PM IST

ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లా అంబేడా ప్రాంతంలో భద్రతా దళాలే లక్ష్యంగా బాంబులు అమరుస్తున్న నక్సలైట్​లకు ఎదురుదెబ్బ తగిలింది. భూమిలో అమర్చుతుండగా అదే బాంబు పేలి ఒక నక్సలైట్ మరణించాడు.

ఈ నెల 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయం 6గంటల ప్రాంతంలో సహదేవ్ వేద్దా.. అంబేడాకు సమీపంలో ఐఈడీ బాంబు అమర్చుతున్నాడు. ఈ క్రమంలో అది పేలి వేద్దా అక్కడికక్కడే మరణించాడు. సమీపంలోని నక్సలైట్లు గాయపడ్డారు.

అమరవీరునిగా..

ఘటన జరిగిన వారం రోజులకు సోమ్జీ అలియాస్ సహదేవ్ వేద్దా మరణాన్ని మావోయిస్టు పార్టీ ధ్రువీకరించింది. ఈ మేరకు ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీ ప్రతినిధి సుఖ్​దేవ్ పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. చనిపోయిన నక్సలైట్​ను అమరవీరుడుగా పేర్కొన్నారు. ఉత్తర బస్తర్ డివిజన్​లోని అనేక గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి.. నక్సలైట్లకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించారు.

Naxalite killed by its own bomb, was planting a bomb for the force
చనిపోయిన నక్సలైట్​ను కీర్తిస్తూ విడుదల చేసిన కరపత్రం

ఇదీ చదవండి: ముష్కరుల గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.