Navratri 2023 Date and Shubh Muhurat : హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది దేవీ శరన్నవరాత్రులు అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రథమ రోజున ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15వ తేదీ అంటే వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం అక్టోబర్ 24వ తేదీన విజయదశమి(Dussehra) వేడుకలతో దేవీ నవరాత్రులు ముగుస్తాయి. ఈ తొమ్మిది రాత్రులు పది రోజులలో తొమ్మిది రూపాలలో దుర్గాదేవిని (Goddess Durga) భక్తులు పూజిస్తారు. ఈ నవరాత్రులనే శరద్ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దుర్గామాత ఈ సమయంలో మానవాళి సంక్షేమానికి కృషి చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ ఏడాది దుర్గాదేవి ఆరాధనకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఏయే రోజు అమ్మవారు ఏయే రూపంలో దర్శనమివ్వనున్నారు, పూజా విధానం మొదలైన వాటి గురించి ఇప్పుడు ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..
శరన్నవరాత్రులు 2023 ఎప్పుడు ప్రారంభం : శరన్నవరాత్రులు అశ్వినీ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీ నాడు రాత్రి 11:24 గంటలకు ప్రతిపాద తిథి ప్రారంభమై అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి 12:24 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15 ఆదివారం నాడు ప్రారంభం కానున్నాయి.
ఈ ఏడాది నవరాత్రుల్లో కలశ స్థాపన శుభ ముహూర్తం : దేవీ నవరాత్రుల మొదటి రోజున అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. ఈ కలశాన్ని శక్తి ఆరాధనలో భాగంగా తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రులు మొదటి రోజు 15 అక్టోబర్ 2023న వస్తుంది. అంటే ఆరోజు కలశాన్ని స్థాపిస్తారు. కలశ స్థాపనకు ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శుభ సమయం.
శారదీయ నవరాత్రి 2023 క్యాలెండర్(Shardiya Navratri 2023 Calendar) :
- అక్టోబరు 15 - ఘటస్థాపన, శైలపుత్రి దేవి పూజ
- అక్టోబర్ 16 - బ్రహ్మచారిణి పూజ
- అక్టోబర్ 17 - సిందూర్ తృతీయ, చంద్రఘంట పూజ
- అక్టోబర్ 18 - కూష్మాండ పూజ, వినాయక చతుర్థి
- అక్టోబర్ 19 - స్కందమాత పూజ
- అక్టోబర్ 20 - కాత్యాయని పూజ
- అక్టోబర్ 21 - సరస్వతి పూజ, కాళరాత్రి పూజ (సప్తమి)
- అక్టోబర్ 22 - దుర్గా అష్టమి, మహాగౌరి పూజ, సంధి పూజ
- అక్టోబర్ 23 - దుర్గా మహా నవమి
- అక్టోబర్ 24 - నవరాత్రి పరణ (ఉపవాస విరమణ), దుర్గా నిమజ్జనం, విజయదశమి
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి!
దేవీ నవరాత్రి పూజ విధానం : నవరాత్రులలో భాగంగా భక్తులు మొదటి రోజున అమ్మవారిని పూజించడానికి సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి, స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత, తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉపవాసం, శుభ సమయంలో ఆచారాల ప్రకారం కలశ స్థాపన చేయండి. దుర్గామాతకు పుష్పాలు, పండ్లు మొదలైన వాటిని సమర్పించడం, మంత్ర స్తోత్రాలతో దుర్గమ్మను పూజించడం మొదలైనవి. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ దుర్గా సప్తశతిని ముఖ్యంగా అమ్మవారి పూజలో పారాయణం చేయండి. ఇలా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి ఆ తర్వాత చివరి రోజు మీరు ఉపవాసం విరమించాలి.