ETV Bharat / bharat

ఇమ్రాన్​ను 'పెద్దన్న'గా సంబోధించిన సిద్ధూ - నవ్​జోత్​ సింగ్ సిద్ధు వార్తలు

కర్తార్​పుర్​ను సందర్శించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu news).. పాక్ ప్రధాని తనకు పెద్దన్న అన్నారు. దీనిపై భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది. ఐఎస్​, బోకో హారం సంస్థలను హిందుత్వంతో ముడిపెట్టిన కాంగ్రెస్​ నేతలు.. ఇమ్రాన్​ను మాత్రం అన్న అని పిలవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తింది. ఇది అత్యంత ఆందోళన చెందాల్సిన విషయమని పేర్కొంది.

Navjot Singh Sidhu Calls Imran Khan 'Big Brother'

author img

By

Published : Nov 20, 2021, 4:01 PM IST

Updated : Nov 20, 2021, 4:29 PM IST

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్​ ​ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu news).. పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తనకు పెద్దన్న లాంటి వారని అన్నారు. కర్తార్​పుర్​ను సందర్శించడానికి పాక్ వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భాజపా తీవ్ర స్థాయిలో మండిపడింది. సిద్ధూ మాటలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఐఎస్​, బోకోహారం సంస్థలను హిందుత్వతో ముడిపెట్టిన కాంగ్రెస్​ నేతలు.. ఇమ్రాన్​ను మాత్రం పెద్దన్న అని పిలవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు(Navjot Singh Sidhu latest news ). హిందుత్వపై విమర్శలు గుప్పించే రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల తరహాలోనే సిద్ధూ మాట్లాడారని విమర్శించారు. కేవలం బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తారన్నారు. పాకిస్థాన్​ను పొగిడితే భారత్​లో ఓ వర్గం సంతోషిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తారని, కానీ అలాంటి వారు ఇక్కడ లేరనే విషయం ఆ పార్టీ తెలుసుకోవాలని హితవు పలికారు.

భాజపా ఐటీ సెల్ ఇంఛార్జ్​, బంగాల్​ కో-ఇన్​ఛార్జ్​ అమిత్ మాలవీయ కూడా ట్విట్టర్​ వేదికగా సిద్ధూపై ధ్వజమెత్తారు.

  • Rahul Gandhi’s favourite Navjot Singh Sidhu calls Pakistan Prime Minister Imran Khan his “bada bhai”. Last time he had hugged Gen Bajwa, Pakistan Army’s Chief, heaped praises.

    Is it any surprise that the Gandhi siblings chose a Pakistan loving Sidhu over veteran Amarinder Singh? pic.twitter.com/zTLHEZT3bC

    — Amit Malviya (@amitmalviya) November 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" రాహుల్ గాంధీకి ఎంతో ఇష్టమైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పాక్ ప్రధానిని బడా భాయ్ అన్నారు. పోయినసారి పాక్ ఆర్మీ చీఫ్ భజ్వాను ఆలింగనం చేసుకుని ప్రశంసలు కురిపించారు. సీనియర్ నేత అమరీందర్ సింగ్​ను కాదని గాంధీ సోదరులు సిద్ధూను ఎంచుకోవడంలో ఆశ్చర్యమేముంది?"

-అమిత్ మాలవియ ట్వీట్​.

తప్పేముంది...

పాక్​ ప్రధానిని సోదరుడు అని సిద్ధూ(Navjot Singh Sidhu latest news ) పిలిస్తే తప్పేంటని పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పాకిస్థాన్​కు వెళ్తే మాత్రం దేశ ప్రేమికుడు అని అంటారు, సిద్ధూ వెళ్తే మాత్రం దేశ ద్రోహి అంటారా? అని మండిపడ్డారు. సోదరుడు అని పిలవడం తప్పా? అన్నారు. గురునానక్ దేవ్ సిద్ధాంతాలనే తాము అనుసరిస్తామని పేర్కొన్నారు.

సరిహద్దులు తెరవాలి..

ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చొరవ వల్లే కర్తార్​పుర్​ నడవా తిరిగి తెరుచుకుందని సిద్ధూ అన్నారు(navjot singh sidhu news today). కర్తార్​పుర్ సాహిబ్​ను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. పంజాబ్ బాగుపాడలంటే వాణిజ్య కార్యకాలాపాల కోసం సరిహద్దులను తిరిగి తెరవాలన్నారు. పంజాబ్​ నుంచి పాకిస్థాన్​కు 21కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు 2100 కిలోమీటర్ల దూరం ఉన్న ముంద్ర పోర్టు నుంచి వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

పంజాబ్​ సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ నేత్వతంలోని కేబినెట్​ మంత్రుల బృందం నవంబర్​ 18 కర్తార్​పుర్​ను సందర్శించడానికి వెళ్లింది. ఈ జాబితాలో సిద్ధూ పేరు లేకపోవడం రాష్ట్ర కాంగ్రెస్​లో మరో వివాదానికి దారి తీసింది(punjab congress crisis). అనంతరం రెండు రోజుల తర్వాత కర్తార్​పుర్​ను సందర్శించేందుకు సిద్ధూ శనివారం ప్రత్యేకంగా పాకిస్థాన్​కు వెళ్లారు.​

పంజాబ్ గురాదస్​పుర్ జిల్లాలోని డేరాబాబా ననక్​, పాకిస్థాన్​లోని​ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ను కలిపేదే కర్తార్​పుర్ కారిడార్. కొవిడ్ కారణంగా 2019లో మూసివేసిన దీన్ని నవంబర్ 17నే తిరిగి తెరిచారు. 4.7కిలోమీటర్లున్న ఈ కారిడార్​ ద్వారా సిక్కులు తమ గురుదైవమైన గురునానక్​ దేవ్​ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

2018లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధూ అతిథిగా వెళ్లారు. అప్పుడే వీరిద్దరి మధ్య బంధం వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: అజయ్​ మిశ్రా హాజరయ్యే సమావేశానికి మోదీ రావొద్దు: ప్రియాంక

Last Updated : Nov 20, 2021, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.