ETV Bharat / bharat

జైలు నుంచి సిద్ధూ ముందస్తు విడుదల.. మోదీ సర్కార్​ రూల్​తో... - navjot singh sidhu release on republic day

34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో జైలుకు వెళ్లిన పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ జనవరి 26న విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆయనకు ఘన స్వాగతం పలకనున్నట్లు కాంగ్రెస్​ నేత ఒకరు తెలిపారు.

Navjot Sidhu
Navjot Sidhu
author img

By

Published : Dec 26, 2022, 3:57 PM IST

Updated : Dec 26, 2022, 4:49 PM IST

Navjot Sidhu Jail : 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ వివాదంలో జైలు శిక్ష అనుభవిస్తున్న పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. జనవరి 26న ఆయనకు విముక్తి లభించనుందని కాంగ్రెస్ పార్టీ నేత నరేంద్ర పాల్ లల్లి తెలిపారు. ఆ రోజు సిద్ధూకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విడుదలైన తర్వాత సిద్ధూ దుర్గియానా ఆలయం, హర్మందిర్ సాహిబ్ ధార్మిక ప్రదేశాల్లో పూజలు చేస్తారని వెల్లడించారు.

ఆ జాబితాలో సిద్ధూ పేరు!
కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం ఏటా సత్ప్రవర్తన గల 50 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేస్తారు. 2023 జనవరి 26న విడుదల చేయబోయే ఖైదీల జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ఆ జాబితాలో సిద్ధూ పేరు ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మే నుంచి జైలులో సిద్ధూ క్లర్క్‌గా పనిచేస్తున్నారని.. ఎలాంటి సెలవులు తీసుకోలేదని తెలుస్తోంది. జైలులో ఆయన ప్రవర్తన బాగానే ఉందని, అందుకే ఆయనను కేంద్రం విడుదల చేయనుందని సమాచారం.

పార్కింగ్​ విషయంలో గొడవ వల్ల..
1988లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో సిద్ధూను రూ.1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని మే నెలలో తీర్పు వెలువరించింది. 1988 డిసెంబరు 27న పంజాబ్​లోని పటియాలో పార్కింగ్‌ విషయంపై 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్‌ సింగ్‌కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గుర్నామ్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన కేసులో ప్రస్తుతం సిద్దూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Last Updated : Dec 26, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.