ETV Bharat / bharat

'వైద్య రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం' - జాతాయ మెడికల్​ కమిషన్​ పారదర్శకతను తెచ్చిందన్న నరేంద్ర మోదీ

వైద్య రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చూట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దిశగా జాతీయ వైద్య కమిషన్​ పారదర్శకతను తీసుకొస్తుందని చెప్పారు. తమిళనాడులోని డాక్టర్​ ఎమ్​జీఆర్​ మెడికల్​ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

National Medical Commission will bring great transparency: PM Modi
వైద్య రంగంలో సరికొత్త మార్పులు తెచ్చాం: ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Feb 26, 2021, 1:16 PM IST

దేశంలో వైద్య విద్య, ఆరోగ్య రంగంలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్​ పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. వైద్య రంగంలో మానవ వనరులను పెంపొందిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త కళాశాలలను నెలకొల్పడానికి నిబంధనలను హేతుబద్ధం చేసినట్లు చెప్పారు. తమిళనాడులోని డాక్టర్​ ఎమ్​జీఆర్​ మెడికల్​ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

" శ్రీలంకలో డిక్​ ఓయా వద్ద ఆసుపత్రి ప్రారంభోత్సవం నేను ఎప్పటికీ మరవలేను. అది ఎందరికో ఉపయోగపడుతోంది. శ్రీలంకలో ఉన్న తమిళ వర్గం కోసం చేసిన ఆ ప్రయత్నం.. ఎమ్​జీఆర్​ని సంతోషపెడుతుంది. శ్రీలంకలోని తమిళ వర్గానికి వైద్య రంగలో సేవ చేయడాన్ని భారత ప్రభుత్వం సదా గౌరవంగా భావిస్తోంది."

- ప్రధాని నరేంద్ర మోదీ

గౌరవం, విశ్వసనీయత అనే సరికొత్త కళ్లతో భారత ఆరోగ్య వ్యవస్థ చూస్తోంది. ప్రపంచం మీ నుంచి సరికొత్త అంచనాలను కలిగి ఉంది. ఈ బాధ్యత మీ భుజస్కంధాలపై ఉందని విద్యార్థులనుద్దేశిస్తూ మాట్లాడారు మోదీ.

గత ఆరేళ్లలో 15 ఎయిమ్స్​లకు పైగా ఆమోదం తెలిపామని ప్రధాని చెప్పారు. 30,000 ఎమ్​బీబీఎస్ సీట్లను కొత్తగా కల్పించినట్లు పేర్కొన్నారు. 2014లో ఉన్న పోస్ట్​ గ్రాడ్యుయేట్స్​ సీట్లను 80 శాతానికి పైగా పెంచామని తెలిపారు.

ఇదీ చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.