ETV Bharat / bharat

జలాశయాలకు నిలయం.. గుక్కెడు నీటికోసం 3కి.మీ ప్రయాణం - నాసిక్​ న్యూస్​

జలాశయాలకు నిలయంగా పేరొందిన మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లా.. ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. జిల్లాలోని అనేక గ్రామాల ప్రజల గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. నీటి కోసం మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి.

water problems in nashik
water problems in nashik
author img

By

Published : Jun 6, 2022, 6:02 AM IST

నీటికోసం పాట్లు.. బురద నీరే శుద్ధి చేసి..

దేశంలో ఎండల తీవ్రత ఇంక తగ్గటం లేదు. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా అనేక ప్రాంతాలు నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రమాదకర రీతిలో బావిలోకి దిగి నీటిని తెచ్చుకుంటున్న సంఘటన ఇటీవల మధ్యప్రదేశ్​లో వెలుగులోకి వచ్చింది.. తాజాగా మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలోని​ ఓ గ్రామంలో ప్రజలు నీళ్ల కోసం మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణిస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. అక్కడ దొరికేవి బురద నీరే కావటం గమనార్హం. ఆ నీటినే శుద్ధి చేసుకుని తాగుతున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది.

water problems in nashik
బురద నీటిని శుద్ధి చేస్తున్న గ్రామస్థులు
water problems in nashik
బిందెలతో మహిళలు

జలాశయాలకు నిలయంగా నాసిక్​ జిల్లాకు పేరుంది. కానీ, చిచెలెఖైరె గ్రామ ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళుతున్నారు. సుదూర ప్రాంతంలోని ఓ బావిలోకి ప్రమాదకర రీతిలో దిగి నీటిని తోడుకుంటున్నారు. బావిలో అట్టుడుగున్న మట్టి కలిసిన నీటినే శుద్ధి చేసి తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. గ్రామంలోని చిన్న పిల్లలు, వృద్ధులు సహా ప్రజలంతా అడవి మధ్యలో ఉన్న బావి వద్దకు నడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

water problems in nashik
నీటిని తీసుకెళుతున్న చిన్నారులు

"మూడు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. ఒక మనిషి బావిలోకి దిగి మట్టితో కలిసిన నీటిని తెస్తాడు. ఆ నీటిని తాగడానికి కూడా వీలుండదు. మాకు నీటి వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."

- ఛాయ శిందే, గ్రామస్థురాలు

తాగడానికి నీరు లేక ప్రజలతో పాటు పశువులు సైతం ఇబ్బందులు పడుతున్నాయని కాశీనాథ్​ శిందే అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు మూడు కిలోమీటర్ల మేర నడిచి నీటిని తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

water problems in nashik
బావి అట్టడుగున నీరు చేదుతున్న వ్యక్తి

"మా గ్రామంలో నీరు లేదు. దీంతో గ్రామంలోని మహిళలు నీటి కోసం ప్రతిరోజు మూడు కిలోమీటర్ల దూరం వెళుతున్నారు. ఇది మాకు చాలా కష్టంగా మారిపోయింది. కనీసం పశువులకు సైతం నీరు లేకుండా పోయింది. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం"

- కాశీనాథ్​ శిందే, గ్రామస్థుడు

ఈ నీటి సమస్య ఒక్క చిచెలెఖైరె గ్రామస్థులదే కాదు. నాసిక్​ జిల్లాలోని అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని రొహిలే గ్రామంలోని ప్రజలు సైతం నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వారు కూడా ప్రమాదకరంగా బావిలోకి దిగుతున్నారు. నాయకులు, అధికారులు ఇకనైనా స్పందించి.. తమ నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.