ETV Bharat / bharat

Narendra Modi Delhi Metro : బర్త్​డే రోజు మోదీ మెట్రో ప్రయాణం.. వారితో ముచ్చట్లు.. చిన్నారికి చాక్లెట్ ఇచ్చి..

Narendra Modi Delhi Metro : ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన రోజున దిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ క్రమంలో ఆయన మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. దిల్లీలో విస్తరించిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే.. ద్వారకాలో నిర్మించిన ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌-IICC ఫేజ్‌-1ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

narendra modi delhi metro
narendra modi delhi metro
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 1:49 PM IST

Updated : Sep 17, 2023, 2:00 PM IST

బర్త్​డే రోజు మోదీ మెట్రో ప్రయాణం.. వారందరితో ముచ్చట్లు

Narendra Modi Delhi Metro : దిల్లీలో విస్తరించిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ద్వారకా సెక్టార్‌ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టార్‌ 25 వరకు రెండు కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌ను విస్తరించారు. మెట్రో లైన్‌ ప్రారంభం తర్వాత.. ప్రధాని అక్కడి ఉద్యోగులు, సిబ్బందితో కాసేపు మాట్లాడారు.

  • #WATCH | Prime Minister Narendra Modi inaugurates the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/8qXxhwtp9i

    — ANI (@ANI) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మోదీ.. మెట్రోలో ప్రయాణించి వచ్చారు. ధౌలా కువాన్‌ స్టేషన్‌లో మెట్రో ఎక్కిన ప్రధాని.. యశోభూమి ద్వారకా సెక్టార్‌ 25 స్టేషన్‌ చేరుకునే వరకు తోటి ప్రయాణికులతో మాట్లాడారు. మెట్రోలోని చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ మహిళ ఆయనకు సంస్కృతంలో శుభాకాంక్షలు చెప్పారు.

  • #WATCH | Delhi: Prime Minister Narendra Modi travels in Delhi Metro ahead of inaugurating the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/O3sKCNDcTK

  • Prime Minister Narendra Modi interacted with passengers while travelling in the metro ahead of inaugurating the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/yR6JYZwY7X

యశోభూమిని జాతికి అంకితం చేసిన మోదీ..
Yashobhumi Dwarka Delhi : దిల్లీలోని ద్వారకాలో నిర్మించిన ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌-IICC ఫేజ్‌-1ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. రూ. 5 వేల 400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యానిధుక సముదాయానికి యశోభూమిగా నామకరణం చేశారు. ప్రారంభోత్సవం తర్వాత యశోభూమిలో పర్యటించిన మోదీ అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. తర్వాత చేతివృత్తుల కళాకారులతో ముచ్చటించారు. వారు తయారుచేసిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.

దేశంలో సభలు, సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఎగ్జిబిషన్ల నిర్వహణ కోసం అద్భుతమైన వసతులతో యశోభూమిని నిర్మించారు. 1.8లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయంలో మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఆడిటోరియాలు, 13 సమావేశ మందిరాలు ఉన్నాయి. వీటిలో ఒకేసారి 11వేల మంది భేటీ కావచ్చు. దేశంలోనే అత్యంత భారీ LED మీడియా స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు. 6వేల మంది కూర్చునేలా.. ఆడిటోరియం తీర్చిదిద్దారు. గ్రాండ్‌ బాల్‌రూమ్‌లో 2 వేల 500 మంది అతిథులు, ఓపెన్ ఏరియాలో మరో 500 మంది ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణ చాటేలా వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లు చేశారు. సౌర విద్యుత్‌ కోసం సోలార్‌ ప్యానళ్లు అమర్చారు.

History of Parliament House of India : 75 ఏళ్ల భారత పార్లమెంటు చరిత్ర.. తగ్గుతున్న యువతరం.. పెరిగిన మహిళా బలం..

Parliament New Building Flag Hoisting : కొత్త పార్లమెంట్​ వద్ద జెండా ఎగురవేసిన ఉపరాష్ట్రపతి.. ఇక అక్కడే సమావేశాలు!

Last Updated : Sep 17, 2023, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.