Nara Lokesh Yuvagalam Padayatra: కోనసీమలో రెండో రోజు కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. పాదయాత్రలో ప్రజలను కలుసుకుంటూ లోకేశ్ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. నారా లోకేశ్‌కు మహిళల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది.
అడుగడుగునా హారతులు పడుతున్న మహిళలు: నేడు లోకేశ్ యువగళం పాదయాత్ర అమలాపురం పేరూరు నుంచి ఉత్సాహంగా ప్రారంభమైంది. అమలాపురం పట్టణం జనంతో కిక్కిరిసిపోయింది. తెలుగుదేశం, జనసేన శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. 211వ రోజు పాదయాత్ర ప్రారంభమైన పేరూరు నుంచి అమలాపురం వరకు జనం అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. దారిపొడవునా మహిళలు, యువత అధిక సంఖ్యలో లోకేశ్‌కు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు ఆయనకు హారతులు పడుతున్నారు. పాదయాత్రలో నినాదాలతో హోరెత్తించారు.
కౌంట్‌డౌన్ ప్రారంభమైంది - వారికి భయం పరిచయం చేసే బాధ్యత నాది : నారా లోకేశ్
టీడీపీలోకి చేరికలు: కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు టీడీపీ గూటికి చేరారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, రౌతులపూడి ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మీ, భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ, తూర్పులక్ష్మీపురం సర్పంచ్ వీరంరెడ్డి సత్యనాగభార్గవితో పలువురు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ సమక్షంలో పేరూరు విడిదికేంద్రంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి లోకేశ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడులో ఈసారి టీడీపీ భారీ మెజార్టీతో గెలవాలని ఈ సందర్భంగా లోకేశ్ అన్నారు.
ఆక్వా రైతులతో భేటీ: నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వ విధానాలు తమకు నచ్చడం లేదని, ప్రత్తిపాడులో ఈసారి టీడీపీ విజయదుందుభి మోగిస్తుందని పార్టీలో చేరిన నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా, నియోజకవర్గం ముఖ్య నేతలు పాల్గొన్నారు. లోకేశ్ పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో భేటీ అయ్యారు.
యువగళం జనగళమై! - పునః ప్రారంభమైన లోకేశ్ పాదయాత్రకు మద్దతు వెల్లువ
Nara Lokesh Interaction With Youth: భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం గంజాయికి రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందని వివరించారు. సాయంత్రం పాదయాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. అనంతవరం సెంటర్లో స్థానికులతో, గున్నేపల్లిలో స్థానికులతో, ముమ్మడివరంలో స్థానికులతో సమావేశం కానున్నారు. రాత్రికి ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస చేయనున్నారు.