ETV Bharat / bharat

పిల్లలకు కొవాగ్జిన్​కు బదులు కొవిషీల్డ్.. తర్వాత ఏమైందంటే?

Nalanda Covid Vaccination Mistake: ఇద్దరు టీనేజర్లకు పొరపాటున కొవాగ్జిన్​కు బదులు కొవిషీల్డ్ టీకా వేశారు వైద్య సిబ్బంది. అయితే వ్యాక్సిన్​ సర్టిఫికెట్​లో మాత్రం ఇద్దరికీ కొవాగ్జిన్ ఇచ్చినట్లుగా ఉంది. ఈ ఘటన బిహార్​లోని నలంద జిల్లాలో జరిగింది.

author img

By

Published : Jan 4, 2022, 11:50 AM IST

covid vaccination mistake
కరోనా వ్యాక్సినేషన్

Nalanda Covid Vaccination Mistake: దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ మాత్రమే ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. అయితే బిహార్​లో మాత్రం ఇద్దరు టీనేజ్​ సోదరులకు కొవాగ్జిన్​కు బదులు కొవిషీల్డ్ టీకా ఇచ్చారు వైద్యులు. దీంతో యువకుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. బిహార్​లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగిందంటే..?

బిహార్, నలంద జిల్లా ఫ్రొఫెసర్ కాలనీకు చెందిన టీనేజ్ సోదరులు కిషోర్​ పియూష్​ రంజన్, ఆర్యన్​ కిరణ్.. సోమవారం కొవాగ్జిన్​ టీకా కోసం కొవిన్ పోర్టల్​లో స్లాట్​ బుక్ చేసుకున్నారు. ఐఎంఏ హాల్​లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రంలో వారికి కొవాగ్జిన్​కు బదులు కొవిషీల్డ్ టీకా ఇచ్చారు సిబ్బంది. ఈ విషయం తెలుసుకుని.. ఇలా ఎందుకు ఇచ్చారని వారు అడగ్గా.. కొవిషీల్డ్ టీకా వల్ల ఎలాంటి ప్రమాదం లేదని టీకా ఇచ్చిన ఆపరేటర్ తెలిపినట్లు ఆ సోదరులు వివరించారు.

covid vaccination mistake
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న సోదరులు

హెల్త్ డిపార్ట్​మెంట్ అశ్రద్ధగా వ్యవహరిస్తోందని టీనేజ్​ సోదరుల తండ్రి ప్రియరంజన్ కుమార్​ ఆగ్రహం వ్యక్తంచేశారు. యువకులకు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వస్తే.. ఇంటికి వైద్యులను పంపిస్తామని సంబందిత హెల్త్ డిపార్ట్​మెంట్ అధికారులు చెప్పినట్లు వివరించారు.

సర్టిఫికెట్​లో మాత్రం కొవాగ్జిన్​..

తమ పిల్లలకు కొవిషీల్డ్​ టీకా ఇవ్వగా.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్​లో మాత్రం కొవాగ్జిన్​ ఇచ్చినట్లుగా ఉందని టీనేజర్ల తండ్రి ప్రియరంజన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ప్రియరంజన్.

covid vaccination mistake
వ్యాక్సినేషన్ ధ్రువపత్రం

వ్యాక్సిన్​ పొరపాటు వ్యవహారాన్ని సీరియస్​గా తీసుకున్న ఉన్నత వైద్యాధికారులు కిషోర్, కిరణ్​లకు వ్యాక్సిన్​ వేసిన ఆపరేటర్లను విధులనుంచి తొలగించారు. యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సివిల్ సర్జన్​ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. సోదరులిద్దరినీ 24గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వివరించారు.

ఇదీ చూడండి: India covid cases: దేశంలో కొత్తగా 37,379 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.