ETV Bharat / bharat

నాగ్​పుర్​లో జైషే మహ్మద్​ రెక్కీ .. నగరంలో హై అలర్ట్​! - నాగ్​పుర్​లో జైషే మహ్మద్​ రెక్కీ

Nagpur on High alert: పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్​కు చెందిన యువత నాగ్​పుర్​లో రెక్కీ నిర్వహించినట్లు నగర పోలీస్​ కమిషనర్​ అమితేశ్​​ కుమార్​ తెలిపారు. దీంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఓ యువకుడిని కేంద్ర దర్యాప్తు బృందాలు అరెస్ట్​ చేసినట్లు స్పష్టం చేశారు.

Nagpur on High alert
నాగ్​పుర్​లో హై అలెర్ట్
author img

By

Published : Jan 7, 2022, 8:19 PM IST

Nagpur on High alert: మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో జమ్ముకశ్మీర్​కు చెందిన కొంతమంది యువత రెక్కీ నిర్వహించారు. ఈ విషయాన్ని నగర పోలీస్​ కమిషనర్​ అమితేశ్​​ కుమార్​ ధ్రువీకరించారు. రెక్కీ నిర్వహించిన వారికి పాక్​కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్​తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నగరంలో హై అలర్ట్​ ప్రకటించారు.

కేంద్ర భద్రతా సంస్థల నుంచి సమాచారం అందుకున్న నాగ్​పుర్​ పోలీసులు.. నగరంలోని కీలక ప్రాంతాలైన ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం, రేషిమ్ బాగ్‌లోని సంఘ్ డాక్టర్ హెడ్గేవార్ స్మారక ప్రాంగణాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడులకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో కమిషనర్​ పర్యటించారు. భద్రతను మరింత పెంచినట్లు పేర్కొన్నారు. రెక్కీ ఎక్కడ నిర్వహించారు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసినట్లు అమితేశ్​​ కుమార్​ పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు జమ్ముకశ్మీర్​కు చెందిన ఓ యువకుడిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. నాగ్​పుర్​లో రెక్కీ నిర్వహించిన విషయం వారి నుంచే తెలిసిందని వివరించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న వ్యక్తి గతేడాది జులైలో నాగ్‌పుర్‌కు వచ్చాడు. రెండు రోజులు పాటు నగరంలో ఉన్నాడు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో రెక్కీ చేసినట్లు నాగ్‌పుర్ పోలీసులకు కేంద్ర ఏజెన్సీ నుంచి సమాచారం అందింది. దీంతో నాగ్​పుర్​ క్రైం బ్రాంచ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఎల్​ఏసీ వద్ద 'చైనా రోబో' సైన్యమా? ఒక్కరూ లేరే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.