Nagpur Family Court Divorce: భార్యతో అత్యంత క్రూరంగా ప్రవర్తించిన భర్తకు విడాకులు మంజూరు చేసింది మహారాష్ట్ర నాగ్‌పుర్ ఫ్యామిలీ కోర్టు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి తన కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని కోర్టును అశ్రయించిన మహిళకు న్యాయం చేసింది. భర్త ఇలా చేయడం అత్యంత క్రూరమైన చర్య అని వ్యాఖ్యానించింది. భార్య అంటే బానిస కాదని, కానీ క్రూరమైన మనస్తత్వం గల కొందరు ఇంకా అలాగే చూస్తున్నారని విచారం వ్యక్తం చేసింది.
భర్త(28) నుంచి విడాకుల పొందిన ఈ బాధితురాలి వయసు 22 ఏళ్లు. 2017లో వీరికి వివాహం అయింది. అతడు మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. అనంతరం భార్య కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో వస్త్రాలు కుక్కి బలవంతంగా సెక్స్ చేసేవాడు. ఇలా కొన్నేళ్లపాటు సాగింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయిని భర్త బెదిరించడం వల్ల ఆమె ఎవరికీ చెప్పలేదు. భర్త తీరు మారకపోవడం వల్ల విసుగుచెంది పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కూతురి బాధ చూసి చలించిపోయిన తల్లిదండ్రులు విడాకుల కోసం ఆమెతో పిటిషన్ వేయించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు భర్త నుంచి విడాకులు మంజూరు చేసింది.
ఇదీ చదవండి: భజరంగ్‌దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు