ETV Bharat / bharat

ఈ చిన్న పనితో- బ్యాంక్​ అకౌంట్​కు 30వేల రూపాయలు, ఇప్పుడే ట్రై చేయండి! - మైగౌ

UMANG: కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాలో రూ.30 వేలు వేస్తోంది. అయితే, అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Mygov_Conduct_Competition_for_6_years_of_UMANG

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 11:31 AM IST

Updated : Nov 21, 2023, 11:43 AM IST

Mygov Conduct Competition for 6 years of UMANG: ఒక్క చిన్న పనితో రూ.30వేలు వస్తున్నాయంటే ఎవరు కాదంటారు. మీరు విన్నది నిజమే. ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా రూ.30 వేలు అందుకునే అవకాశం ఉంది. కేంద్ర సర్కార్ ఈ సూపర్ ఆఫర్ అందిస్తోంది. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ కాంటెస్ట్​​ గురించి తెలుసుకోవాల్సిందే.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ తాజాగా మైగౌ(mygov) భాగస్వామ్యంతో సూపర్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఉమాంగ్ యాప్(UMANG App) అందుబాటులోకి తీసుకొచ్చి 6 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర సర్కార్ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడే తెలుసుకుందాం....

How to Use Umang App and its Features : ఒక్క ఉమాంగ్ యాప్​తో ఎన్నో ప్రభుత్వ సేవలు.. ఇలా వాడేయండి!

UMANG App Full Details in Telugu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సేవలన్నింటిన్ని ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందించేలా ఉమాంగ్ యాప్‌ను 2017 నవంబర్​లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలందరికీ ఇది సింగిల్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తోంది. ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. భారత్‌లో మొబైల్ గవర్నెన్స్‌ను ప్రోత్సహించడం కోసం నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కలిసి ఈ యాప్‌ను రూపొందించాయి. ఇది ఒక మాస్టర్ అప్లికేషన్‌లా పనిచేస్తుంది. వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్యం, హౌసింగ్ వంటి పలు రంగాలకు చెందిన ప్రభుత్వ సేవలను ఇది అందిస్తోంది.

ఉదాహరణకు పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం వంటి సౌకర్యాలను ఉమాంగ్ నుంచి ప్రజలు పొందవచ్చు. ఇలా మరెన్నో రకాల సేవలు లభిస్తాయి ఈ ప్లాట్‌ఫామ్‌పై. బహు భాషా విధానంలో ఇది రూపొందింది. అంటే స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా ఈ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. 13 స్థానిక భాషలు మరాఠి, తమిళ్, అస్సామీ, గుజరాతి, బెంగాలి, కన్నడ, ఒడియా, పంజాబి, మలయాళం, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇక కాంటెస్ట్​ వివరాలకు వస్తే.. ఇందులో మూడు రకాల పోటీలు ఉన్నాయి. అవి ట్యాగ్​లైన్​, వీడియో మేకింగ్​, పోస్టర్​ తయారీ..

LIC Jeevan Umang Policy : ఈ ఎల్​ఐసీ పాలసీతో.. 100 ఏళ్ల వరకు పెన్షన్​ గ్యారెంటీ.. కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా..

ట్యాగ్‌లైన్ రైటింగ్..:

Tagline Writing Competition for 6 Years of UMANG: ట్యాగ్‌లైన్ రైటింగ్ కాంటెస్ట్​లో పాల్గొనేందుకు డిసెంబర్ 13 వరకు ఛాన్స్ ఉంది. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ. 7500 ఇస్తారు. రెండో స్థానంలో ఉంటే రూ. 5 వేలు, మూడో స్థానంలో ఉంటే రూ. 3,500 లభిస్తాయి. తర్వాతి 7 మందికి రూ. 1500 చొప్పున ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది. ట్యాగ్‌లైన్ 7 పదాల్లోనే ఉండాలి. హిందీ లేదా ఇంగ్లీష్‌లో ట్యాగ్‌లైన్ ఉండొచ్చు. ట్యాగ్​లైన్​ UMANG యాప్​ గురించే ఉండాలి. పూర్తి వివరాలకు ఈ లింక్​ పై క్లిక్​ చేసి.. పార్టిసిపేట్​ చేయడానికి లాగిన్​ అవ్వండి.

How to Check PF Balance in UMANG App : మీ పీఎఫ్​ అకౌంట్లో ఎంత డబ్బుంది..? సింపుల్​గా చెక్ చేసుకోండి..!

వీడియో మేకింగ్‌ or రీల్​ మేకింగ్​..

Reel Making Competition for 6 Years of UMANG: ఈ పోటీలో భాగంగా మీరు ఓ రీల్ రూపొందించాల్సి ఉంటుంది. ఉమాంగ్ యాప్ బెనిఫిట్స్, డిజిటల్ ఇండియా, ఉమాంగ్ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఉమాంగ్ వల్ల మీ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు వంటి వివిధ అంశాలను తెలిపేలా మీ రీల్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొని విజేతగా నిలిస్తే వారికి క్యాష్ ప్రైజ్ అందిస్తుంది కేంద్రం. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 15 వేలు అందిస్తారు. రెండో స్థానంలో ఉన్న వారికి రూ. 12 వేలు, మూడో స్థానంలో ఉన్న వారికి రూ.10 వేలు బహుమతి లభిస్తుంది. తర్వాత 7 మందికి రూ. 2 వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తారు. మీరు చేసే రీల్స్ 90 సెకన్ల లోపు ఉండాలి. డిసెంబర్ 8 వరకు మీరు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ లింక్​ పై క్లిక్​ చేసి.. పార్టిసిపేట్​ చేయడానికి లాగిన్​ అవ్వండి.

PF Interest 2023 : పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియ మొదలైంది.. ఇలా సింపుల్​గా చెక్ చేసుకోండి!

పోస్టర్ తయారీ..

Poster Making Competition for 6 Years of UMANG : అలాగే ఉమాంగ్ యాప్‌కు సంబంధించి రీల్​ కాంటెస్ట్ కాంకుండా పోస్టర్ తయారు పోటీలో కూడా పాల్గొనవచ్చు. ఈ పోటీలో పాల్గొనేందుకు డిసెంబర్ 17 వరకు అవకాశం ఉంటుంది. విజేతగా నిలిస్తే.. రూ.7,500 అందిస్తారు. రెండో స్థానంలో ఉంటే రూ.5 వేలు.. మూడో బహుమతి కింద రూ.3500 ఇస్తారు. తర్వాతి 7 మందికి ప్రోత్సాహక బహుమతిగా రూ. 1500 అందిస్తారు. అంటే మూడు కాంటెస్ట్‌లో విజేతగా నిలిస్తే.. రూ. 30 వేలు గెలుచుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్​పై క్లిక్​ చేసి.. పార్టిసిపేట్​ చేయడానికి లాగిన్​ అవ్వండి..

ఉమంగ్ యాప్​తో పీఎఫ్​ విత్​డ్రా చేసుకోండిలా..

Last Updated : Nov 21, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.