మిజోరం(Mizoram news) ఎన్డీఏలో సంఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. కేంద్రం నియమించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని (Mizoram CS) మార్చాలని ముఖ్యమంత్రి, ఎన్డీఏ భాగస్వామి మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడే (Mizoram CM) స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాయడం సంచలనంగా మారింది.
మిజోరం కేబినెట్లోని చాలా మంది మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు హిందీ రాదని, ఇంగ్లీష్ కూడా సరిగా అర్థం చేసుకోలేరని కారణం చెప్పడం గమనార్హం. అందుకే సీఎస్‌గా(Mizoram CS) ఉన్న రేణు శర్మను తప్పించి.. మిజో భాష (Mizoram language) తెలిసిన వేరొకరిని నియమించాల్సిందిగా సీఎం జొరాంథంగా కోరారు. ప్రస్తుత అదనపు ముఖ్య కార్యదర్శి జేసీ రామ్థంగాకు పదోన్నతి కల్పించి.. సీఎస్‌గా నియమించాలని ప్రతిపాదించారు.
''నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాను. చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీలు కూటములు మారాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి నుంచి నేను ఎన్డీఏకు నమ్మకస్తుడిగా ఉన్నాను. అందుకే నా విజ్ఞప్తిని పరిశీలిస్తుందని అనుకుంటున్నా.''
- జొరాంథంగా, మిజోరం సీఎం
మిజోరం సీఎస్‌గా(Mizoram news) రేణు శర్మను గత నెల నియమించింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే.. మిజో భాష తెలియని ఆమె ఎప్పటికీ సమర్థమైన సీఎస్ కాలేరని, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్థానిక భాష(Mizoram language) తెలియని వారిని కేంద్రం ఎప్పుడూ నియమించలేదని ముఖ్యమంత్రి అన్నారు.
ఒకవేళ ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరిస్తే.. ఎన్డీఏకు విశ్వాసపాత్రంగా పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తనను ఎగతాళి చేస్తాయని చెప్పారు(Mizoram CM).
ఇదీ చూడండి: 'ఆ శిశువుకు రెండు తలలు!'.. చూసేందుకు ఎగబడిన జనం!!