ETV Bharat / bharat

మటన్​ కావాలా? ప్రేమ కావాలా? తల పట్టుకుంటున్న భర్త! - wife and husband JOKES

Mutton or Me: అన్యోన్యంగా జీవిస్తున్న భార్యాభర్తల మధ్య మటన్​ చిచ్చు పెట్టింది. ఇప్పుడు మటన్​ కావాలా? నేను కావాలా? అంటూ భార్యకు అల్టిమేటం విధించాడా బాధితుడు. అసలు సంగతేంటి? ఏం జరిగింది?

Mutton or Me: Vegetarian husband asks wife to choose
మటన్​ కావాలా? ప్రేమ కావాలా
author img

By

Published : Dec 3, 2021, 2:18 PM IST

Mutton or Me: సంసారంలో భార్యాభర్తలకు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి చిత్రమైన స్టోరీనే. ఇక్కడ భోజనం విషయంలో భేదాభిప్రాయం.. వారి సంబంధం దెబ్బతినే పరిస్థితికి దారితీసింది.

ఆ దంపతులు ఇద్దరు శాకాహారులు. తన భార్య మాంసాహారం తింటుందని ఆ భర్తకు తెలుసు. కానీ పెళ్లి తర్వాత తిననని ఒట్టు వేయించుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత ఆమె తనకు తెలియకుండా మటన్​ తింటుందని తెలుసుకున్నాడు. అక్కడ మొదలైంది గొడవ. నేను కావాలా? మటన్​ కావాలా? తేల్చుకో అంటూ అల్టిమేటం విధించాడు.

అయితే ఇప్పుడా భర్తకు వేరే భయం పట్టుకుంది. తన భార్య ఒకవేళ మటన్​ మానక, తనను వదులుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంటని వాపోతున్నాడు.

ఈ సమస్యను పరిష్కరించుకోలేక, నిపుణుల నుంచి సలహా కోసం ఓ పత్రికకు రాశాడు.

ఓ యూజర్ ఆ పేపర్ కటింగ్‌ను తన ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. ఆ ప్రశ్న, జవాబు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ప్రశ్న:

''ఆమె చాలా అందంగా ఉంటుంది. తను ఇక ఎప్పుడూ ఎక్కడ మటన్​ తినననే షరతుతో పెళ్లికి ఒప్పుకున్నా. కానీ ఇప్పుడు తను మటన్​ అంటే ఇష్టం. అది లేకుండా ఉండలేను అంటోంది. నేను ఒకసారి తనను క్షమించా. ఇప్పుడు మాత్రం అలా చేయలేను. మటన్​ కావాలా? ప్రేమ కావాలా? అని అల్టిమేటం విధించా.

కానీ ఇప్పుడు భయమేస్తోంది. తను మటన్​నే ఎంచుకుంటే నా పరిస్థితి ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు?''

- భర్త ఫిర్యాదు

జవాబు:

'కంగ్రాట్స్​. నువ్వు కొత్త రికార్డు సృష్టించావు. ఇది ఫస్ట్ లవ్​ ట్రయాంగిల్. ఇక్కడ మనిషిని ఎంచుకోవాలా? మేకను ఎంచుకోవాలా? అనేది మహిళ ముందున్న ప్రశ్న. అయితే, ప్రేమ లేకుండా జీవించొచ్చు. కానీ ఫుడ్ లేకుండా కష్టం. మీకు అర్థమైందనుకుంటా.'

దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో ఇదంతా వాస్తవం కాదని అంటుంటే, మరికొందరు రెండింట్లో ఏదో తేల్చుకోవడం చాలా కష్టం అని చెబుతున్నారు.

తాను పూర్తి శాకాహారి అయినప్పటికీ.. ఈ విషయంలో మనిషికి(భర్తకు) బదులు మటన్​నే ఎంచుకుంటానని ఓ యువతి​ పోస్ట్​ చేసింది.

Mutton or Me: Vegetarian husband asks wife to choose
నెటిజన్ల స్పందన

మనిషి తాత్కాలికం, మాంసం ఎప్పటికీ ఉంటుంది అని మరొకరు అన్నారు.

ఇద్దరూ రాజీపడి.. చికెన్​ తినండి ఓ నెటిజన్​ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

నెటిజన్​ రియాక్షన్​

ఇవీ చూడండి: పెళ్లైన 12 గంటల్లోనే భార్యకు ట్రిపుల్​ తలాక్.. అవి కావాలంటూ!

అమలిన ప్రేమ.. 65 ఏళ్ల వయసులో ఒక్కటైన జంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.