మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో దారుణం జరిగింది. వారం రోజుల క్రితం అదృశ్యమైన బాలిక శవమై తేలింది. బాలికను దుండగులు హత్యచేసి.. ప్లాస్టిక్ బ్యాగ్లో కుక్కి చిన్నారి ఇంటి సమీపంలోనే పూడ్చిపెట్టారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలిక బంధువులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
![Mutilated body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12415260_884_12415260_1625917511235.png)
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ విక్రమ్ సింగ్ తెలిపారు.
![Mutilated body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-sgr-01-lapata-ladki-murder-cut-bite-7208095_10072021114237_1007f_1625897557_328.jpg)
అతడేనా?
మృతురాలి తల్లి రెండు పెళ్లిళ్లు చేసుకుంది. ప్రస్తుతం రెండో భర్త వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో మారు తండ్రే.. ఈ ఘటనకు పాల్పడి ఉంటాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి : వైరల్: పులిని తరిమికొట్టిన గ్రామస్థులు.!