ETV Bharat / bharat

కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..

దేశంలో కరోనా కేసుల పెరుగుదలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్‌ నిబంధనలను అమలుచేయడంలో ప్రభుత్వాల ఉదాసీనత, ప్రజల నిర్లక్ష్యం, వైరస్‌ ఉత్పరివర్తనం, ఎన్నికల ప్రక్రియ మహమ్మారి విజృంభణకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా అప్రమత్తమై నియంత్రణ చర్యలు తీసుకోకపోతే రెండో దశ ఉద్ధృతి మే మొదటివారానికి తీవ్రమవుతుందని హెచ్చరించారు.

corona cases
కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..
author img

By

Published : Apr 11, 2021, 5:21 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య శనివారం నాటికి కోటీ 32లక్షలు దాటింది. రోజువారి కేసులు లక్షన్నర దాటాయి. రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు పెరగటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రెండో దశ ఉద్ధృతికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ప్రభుత్వాల ఉదాసీనత, ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి వైరస్‌ వ్యాప్తికి కారణాలుగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వ్యాక్సినేషన్‌ మొదలయ్యాక కొవిడ్‌ నిబంధనలు పాటించే విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. టీకా తీసుకున్నవారు తమకు కరోనా రాదనే ధీమాతో నిబంధనలను పట్టించుకోకపోవటం కూడా మరో కారణమన్నారు. ఈ తరహా వ్యవహారశైలి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంటున్నారు.

గతంలో కంటే వేగంగా..

దేశంలో కరోనా మహమ్మారి ఉత్పరివర్తనం చెంది గతంలో కంటే వ్యాప్తి సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలి దశ కంటే రెండో దశ కరోనా వ్యాప్తి రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇతర దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించిన కొవిడ్ ఉత్పరివర్తనాలు కూడా కేసుల ఉద్ధృతికి దోహదం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పంజాబ్‌లోని 80శాతం, మహారాష్ట్రలో 15 నుంచి 20శాతం కేసులకు బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రస్తుతం దేశంలో బ్రిటన్‌ స్ట్రెయిన్‌తోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వైరస్‌ కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిలో యూకే వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి సామర్థ్యం మిగితా వాటి కంటే 50శాతం అధికంగా ఉందని పరిశోధకులు తెలిపారు.

తెరవడం వల్లే..

లాక్‌డౌన్‌ అనంతరం సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయకుండా ఒక్కసారిగా దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, పాఠశాలలు తెరవడం కూడా కరోనా విజృంభణకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలతోపాటు ప్రభుత్వాలు కూడా వైరస్‌ను తేలిగ్గా తీసుకున్నట్లు వివరించారు. ఎన్నికల వేళ ఏ పార్టీకి కరోనా నిబంధనలు పట్టకపోవడం, ప్రచార సభలకు భారీ జనసమీకరణతో కరోనా కోరలు వాడిగా మారినట్లు చెప్పారు.

టీకాలు వృథా..

తొలిదశలో వైద్యసిబ్బందికి కరోనా టీకా ఇచ్చినప్పటికీ వారిలో కొంతమందికి అవసరం లేకున్నా వ్యాక్సిన్‌ వేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఫలితంగా చాలాటీకాలు వృథా అయినట్లు తెలిపారు. ఎక్కువ మంది టీకా తీసుకోవటానికి విముఖత చూపడం కూడా కేసుల పెరుగుదలకు మరో కారణమన్నారు. కరోనా పంజా విసురుతున్నప్పటికీ టీకా పంపిణీ మందకొండిగా సాగటం ఆందోళన కలిగిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. జనవరిలో టీకా పంపిణీ ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకూ దేశ జనాభాలో కేవలం 0.7శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. 5 శాతం మంది ఒక డోసు తీసుకున్నట్లు వివరించారు.

సూచనలు..

కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. టీకాల ఉత్పత్తి పెంచటంతోపాటు స్పుత్నిక్‌-వీ వంటి వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి ఇవ్వాలని సూచించారు. నెలకు కోటీ డోసుల ఉత్పత్తి సామర్థ్యమున్న కొవిషీల్డ్, 30లక్షల కోవాగ్జిన్‌ డోసుల తయారీ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు నిబంధనలు కఠినంగా అమలు చేయటంతోపాటు టెస్టుల సంఖ్యను పెంచి, కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ చేయాలని చెప్పారు.

ఇదీ చూడండి: వైరల్: కరోనా నివారణకు మంత్రి పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.