హిందూ-ముస్లిం భాయీభాయీ (Hindu Muslim unity in India) అనేది దేశంలో సుపరిచితమైన నానుడి. హిందూ-ముస్లిం మధ్య సఖ్యతను (Hindu Muslim unity) చాటిచెప్పే నినాదం ఇది. దీన్ని నిజం చేస్తూ.. ఓ ముస్లిం మహిళ.. హిందూ గుడిలో పూజలు చేశారు. మత సామరస్యానికి అద్దం పట్టే ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది. (Karnataka Shivamogga news)
దసరా సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు చేయడం హిందువుల ఆనవాయితీ. ప్రతి దుర్గా దేవి గుడిలో ఘనంగా నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయి. ఇదే విధంగా శివమొగ్గలోని సాగర్ ప్రాంతంలోనూ విశిష్ట పూజలు జరిపించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఓ ముస్లిం మహిళ సైతం పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. అమ్మవారి మందిరం గర్భగుడిలోకి వచ్చి పూజలో పాల్గొన్నారు ఫమీదా అనే మహిళ. తమ సంప్రదాయంగా ధరించే బుర్ఖాతోనే గుడికి వచ్చారు.
50 ఏళ్ల క్రితం నిర్మాణం
ఈ మందిరాన్ని ఫమీదా భర్త కట్టించడం మరో ప్రత్యేకత. రైల్వేలో పనిచేసే ఫమీదా భర్త.. 50 ఏళ్ల క్రితం భగవతి అమ్మవారి మందిరాన్ని కట్టించారు. అనంతరం దాని నిర్వహణను హిందువులకు అప్పగించారు. నిత్యం ఇక్కడ పూజలు జరిపిస్తారు. చుట్టుపక్కల వారు ఈ మందిరానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు.
ఇవీ చదవండి:
- 'వెన్న తింటున్న కృష్ణుడి బొమ్మ'... కేరాఫ్ ముస్లిం మహిళ
- హిందూ-ముస్లిం భాయిభాయి.. ఈ బంధం చూడవోయి
- హిందూ-ముస్లిం సోదరభావం ఉట్టిపడే ఆలయమిది!
- యక్షగానంలో ముస్లిం మహిళ అసమాన ప్రతిభ
- 'ఛఠ్పూజ'లో ముస్లిం మహిళల పొయ్యిలే ప్రత్యేకం
- హిందూ ఆలయం కోసం ముస్లిం భూదానం
- ఈ శ్మశానవాటిక.. సామాజిక ఐకమత్యానికి ప్రతీక
- మహాశివుడికి ముస్లిం సోదరుల నిత్య పూజలు!
- హిందూ దేవుడికి పరమ భక్తుడైన ముస్లిం!
- వెంకటేశ్వర ఆలయంలో ముస్లింల పూజలు
- ముస్లిం నిర్మించిన హిందూ దేవాలయం- ఎక్కడంటే..?
- కట్టుబాట్లు ఛేదిస్తూ.. మృతదేహాలను దహనం చేస్తూ..