ETV Bharat / bharat

శివ భక్తులు భజన చేసేందుకు మండపం నిర్మించిన ముస్లిం మహిళ.. ఎక్కడంటే?

ఆధ్యాత్మిక నగరమైన కాశీలో ఓ ముస్లిం మహిళ శివాలయాన్ని నిర్మింపజేసింది. అయితే ఆ దేవాలయం చిన్నగా ఉన్నందువల్ల అక్కడ కూర్చుని భజన చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు. ఇది చూసిన ఆ మహిళ వారి కోసం ఏదైన చేయాలనుకున్నారు. మరోవైపు హిందూ ముస్లింలు కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు.

varanasi muslim women built auditorium and shiv temple
varanasi muslim women built auditorium for bhajans
author img

By

Published : Oct 29, 2022, 3:17 PM IST

హిందూ ముస్లిం భాయిభాయి అనేందుకు నిదర్శనంగా దేశమంతటా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తుంటాయి. చాలాచోట్ల హిందూ పండుగలను ముస్లింలు జరుపుకోవడం.. ముస్లిం పండుగలను హిందువులు ఆదరించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఓ ఆసక్తికరమైన ఘటన ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలో జరిగింది.

వారణాసిలోని గణేశ్​​పూర్​ రుద్రబిహార్​ కాలనీకి చెందిన నూర్​ ఫాతిమా వృత్తిపరంగా అడ్వొకేట్​. ముస్లిం అయినప్పటికి ఆమె శివభక్తురాలు. 2004లో ఆమె తను ఉండే కాలనీలో శివాలయాన్ని కట్టించారు. స్థానికులు ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ఆ గుడి చిన్నగా ఉన్నందువల్ల అక్కడ కూర్చుని భజన చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు.

muslim woman made auditorium for shiv temple
శివాలయం

ఇది చూసిన నూర్​ వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దీంతో ఆలయం ముందు ఓ మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు అందరూ అక్కడ కూర్చుని భజనలు చేస్తున్నారు. తమ కోసం నూర్​ ఈ ఆడిటోరియం నిర్మించినందుకు కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తాను శివుని దర్శనం చేసుకుని వెళ్తానని నూర్ చెబుతున్నారు. దీని వల్ల తనకు అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని చెప్పుకొచ్చారు.

పూజలు చేస్తున్న నూర్​ ఫాతిమ

హిందూ ముస్లింలు కలిసి దీపావళి వేడుక....
మరోవైపు, మహరాష్ట్రలోనూ మతసామరస్యానికి అద్దంపట్టే ఘటన జరిగింది. బీడ్‌ జిల్లా, గెవ్రాయి తాలూకాలోని ధోండరాయి గ్రామంలో మతాలకు అతీతంగా అక్కడి గ్రామస్థులు ఒకరి పండుగలు ఒకరు జరుపుకొంటున్నారు. ఈ ఆచారంలో భాగంగా ముస్లింలు, హిందువులు కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ మసీదులో ముస్లిం సోదరులకు హిందువులు ఏర్పాటు చేసిన స్నేహహస్తం అనే కార్యక్రమంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఆహ్లాదంగా మారింది. ఇందులో భాగంగా హిందువులు ముస్లింలకు భోజనాలు పెట్టారు. హిందూ ముస్లిం ఐక్యతను చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాలను గత ఏడేళ్లుగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండి: గుడిలో చోరీ.. 'సారీ, తప్పు చేశా'.. అంటూ వస్తువులు తిరిగిచ్చిన దొంగ

కోటి మంది కలిసి ఒకేసారి గానం రికార్డు సృష్టించిన కన్నడిగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.