ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం.. ముస్లిం కుటుంబం భారీ విరాళం - Virat Ramayan Mandir

Muslim Family Donates to Temple: మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోంది. దీనిని రుజువుచేసే ఘటన బిహార్​లో మరొకటి వెలుగుచూసింది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం కోసం.. రూ. 2.5 కోట్లు విలువచేసే భూమిని విరాళంగా ఇచ్చింది ఓ ముస్లిం కుటుంబం.

Muslim family donates Rs 2.5 crore land for construction of world's largest temple in Bihar

author img

By

Published : Mar 22, 2022, 7:28 PM IST

Updated : Nov 28, 2022, 12:16 PM IST

Muslim Family Donates to Temple: 'హిందూ- ముస్లిం భాయీభాయీ'.. మనదేశంలో సుపరిచితమైన నానుడి. హిందూ- ముస్లిం సఖ్యతను చాటిచెప్పే నినాదం ఇది. దీన్ని నిజం చేస్తూ.. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది బిహార్​లోని ఓ ముస్లిం కుటుంబం. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఎత్తైన హిందూ దేవాలయ నిర్మాణం బిహార్​ తూర్పు చంపారన్​ జిల్లా కైథ్​వలియాలో జరుగుతోంది. ఈ 'విరాట్​ రామాయణ మందిర్​' నిర్మాణం కోసం రూ. 2.5 కోట్లు విలువచేసే భూమిని విరాళంగా ఇచ్చిందో ముస్లిం కుటుంబం.

Virat Ramayan Mandir: ఆలయ నిర్మాణానికి ఏదైనా చేయడం తన బాధ్యత అని చెబుతున్నారు వ్యాపారి అయిన ఇష్తియాక్​ అహ్మద్​ ఖాన్​. తనకు, తన కుటుంబానికి చెందిన 23 కట్టా లేదా 71 డిసిమల్స్​ భూమిని (0.71 ఎకరాలు) ఆలయానికి ఇచ్చారు. కేసరియా సబ్​డివిజన్​లోని రిజిస్ట్రార్​ కార్యాలయంలో సంబంధిత ప్రక్రియను పూర్తిచేశారు.

''గ్రామంలో ఎక్కువ భూమి మా కుటుంబానికే ఉంది. అందుకే.. నా బాధ్యతగా ఆలయ నిర్మాణానికి ఏదైనా చేయాలనుకున్నాను. ఇది మాకు సంప్రదాయంగా వస్తోంది.''

- ఇష్తియాక్​ అహ్మద్​ ఖాన్​, దాత

విరాట్​ రామాయణ్​ మందిర్​ ఆలయ నిర్మాణం బాధ్యతను పట్నాకు చెందిన మహవీర్​ మందిర్​ ట్రస్ట్​ చూస్తోంది. 'గువాహటిలో వ్యాపారం చేసే ఖాన్​ కుటుంబం.. ఆలయం నిర్మాణం కోసం సాయం చేస్తామని ఎప్పటినుంచో చెబుతోందని' అని పేర్కొన్నారు ట్రస్ట్​ అధ్యక్షుడు ఆచార్య కిశోర్​ కునాల్​. ప్రధాన రహదారిపై ఉన్న భూమిని కూడా సబ్సిడీ ధరకు ఇచ్చారని తెలిపారు. అహ్మద్​ ఖాన్​ను ఆదర్శంగా తీసుకొని.. భూమిని ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారని, ఇప్పటివరకు మొత్తం 100 ఎకరాల భూమిని సేకరించినట్లు వివరించారు.

''ఖాన్​ కుటుంబం.. మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ముస్లింల సాయం లేకుంటే.. అసలు ఈ కలల ప్రాజెక్ట్​ సాకారం అవ్వడం కష్టం.''

- కిశోర్​ కునాల్​, ట్రస్ట్​ చీఫ్​

ఈ హిందూ దేవాలయం మొత్తం 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్నట్లు కునాల్​ తెలిపారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణంలో భాగమైన.. అనుభవజ్ఞులైన హస్తకళాకారులు, సాంకేతిక నిపుణులు ఇందుకోసం పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

Worlds Largest Temple: విరాట్​ రామాయణ ఆలయం ఎత్తు 270 అడుగులు ఉంటుందని కునాల్​ చెప్పారు. 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఆలయంగా చరిత్ర లిఖిస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముడు జానక్​పుర్​ నుంచి అయోధ్యకు తిరిగొస్తుండగా రాత్రిపూట బసచేసినట్లుగా విశ్వసించే దేవకీ నదిని ఆనుకొని ఈ ఆలయ నిర్మాణం జరగనుందని అన్నారు.

ఇవీ చూడండి: హిందూ దేవుడికి పరమ భక్తుడైన ముస్లిం!

మహాశివుడికి ముస్లిం సోదరుల నిత్య పూజలు!

ముస్లిం నిర్మించిన హిందూ దేవాలయం- ఎక్కడంటే..?

భర్త కట్టించిన దుర్గమ్మ గుడిలో ముస్లిం మహిళ పూజలు

Last Updated : Nov 28, 2022, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.