అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ముంబయికి చెందిన ముస్లిం స్వచ్ఛంద సేవా సంస్థలు రూ.5లక్షలు విరాళం ఇచ్చింది. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రామ మందిర ట్రస్టు సభ్యులకు అందించింది.
రామమందిర నిర్మాణం విషయంలో కొందరు ఆందోళన చెందినా.. ప్రస్తుతం అన్ని మతాల వారు సహకరిస్తున్నారని మహారాష్ట్ర భాజపా మైనారిటీ విభాగం అధ్యక్షుడు వసీమ్ ఖాన్ తెలిపారు. ముస్లింలు రూ.5లక్షలు విరాళం ప్రకటించడం మంచి సందేశాన్నిస్తుందన్నారు.
దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆహ్వనించామని బాలీవుడ్ నటుడు 'రజా మురాద్' తెలిపారు. దేశంలో అన్ని మతాలను ఆరాధిస్తామన్నారు. ప్రార్థనా స్థలాల పట్ల అదే గౌరవాన్ని కలిగి ఉండాలన్నారు.
ఇదీ చదవండి: రైతు గుండె చప్పుడు- రాకేశ్ టికాయిత్!