ETV Bharat / bharat

తల్లి, కూతురు దారుణ హత్య.. మరో కుమార్తె, డ్రైవర్ ఆత్మహత్య.. ఏమైంది? - mumbai crime news

Mumbai Crime News: డ్రైవర్​తో కలిసి తల్లి, కూతురును హత్య చేసింది ఓ కూతురు. ఆ తర్వాత అతనితో పాటే ఆత్యహత్యకు పాల్పడింది. మహారాష్ట్ర ముంబయిలో ఈ ఘటన జరిగింది.

mumbai-mother-daughter-duo-killed
తల్లీకూతురు దారుణ హత్య.. మరో కుమార్తె, డ్రైవర్ ఆత్మహత్య
author img

By

Published : Jun 30, 2022, 5:42 PM IST

Updated : Jun 30, 2022, 6:48 PM IST

Mother daughter Killed: మహారాష్ట్ర ముంబయిలో దారుణ ఘటన జరిగింది. డ్రైవర్​తో కలిసి సొంత తొల్లి, అక్కను హత్య చేసింది ఓ కూతురు. ఆ తర్వాత డ్రైవర్​తో పాటే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కందివలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు తల్లీకూతుళ్ల శవాలు భవనం రెండో అంతస్తులో రక్తపుమడుగులో కన్పించాయి. చిన్నకూతురు, డ్రైవర్ శవాలు మొదటి అంతస్తులో ఉరికి వేలాడుతూ ఉన్నాయి.

ఈ నలుగురు చనిపోయిన రెండు అంతస్తుల భవనం ఇల్లు, ఆస్పత్రిగా ఉంది. హత్యకు గురైన వారిని కిరణ్​ దాల్వి(45), ఆమె కూతురు ముస్కాన్​(26)గా గుర్తించారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న చిన్న కుమార్తె పేరు భూమి(17) కాగా.. డ్రైవర్ పేరు శివ్​దయాల్​ సేన్​(60). కిరణ్​ దాల్వి, ముస్కాన్​ను చంపి తామూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డ్రైవర్​ వద్ద లభించిన లేఖల్లో ఉందని పోలీసులు తెలిపారు. అతడు ఈ ఇంట్లో పదేళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంటి గొడవల వల్లే ఈ హత్యలు, ఆత్మహత్యలు జరిగినట్లు భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

కందివలి(వెస్ట్​)లోని దేనా బ్యాంక్ జంక్షన్​లో ఓ వ్యక్తి కొడవలి పట్టుకుని తిరుగుతున్నట్లు తమకు మొదట సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి చేరుకోగా.. దాల్వి హాస్పిటల్ భవనంలోకి కొడవలి కల్గిన ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు వెళ్లారని.. ఆ తర్వాత లోపలి నుంచి అరుపులు కేకలు వినిపించిట్లు స్థానికులు చెప్పారని వెల్లడించారు. గురువారం ఉదయం మూడున్నరకు భవనంలోకి వెళ్లి చూశాక మొదటి అంతస్తులో భూమి, డ్రైవర్​ ఉరికి వేలాడుతూ కన్పించారని, రెండో అంతస్తులో కిరణ్ దాల్వి, ముస్కాన్ రక్తపుమడుగులో శవాలుగా ఉన్నారని వివరించారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శతాబ్ది ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

17 ఏళ్ల బాలిక ఆత్మహత్య: ముంబయిలోని మాలాడ్ ప్రాంతంలో 17ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తన ఫోన్​ను సోదరి మురికికాలువలో పడేసిందనే కారణంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే మృతురాలికి పొరుగింటి యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, అది తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమెను మందలించారని పోలీసులు తెలిపారు. బాలిక రోజూ లవర్​తోనే మాట్లాడుతుందనే అనుమానంతో ఆమె అక్క తిట్టి.. ఫోన్​ను మురికి కాలువలో పడేసిందని వివరించారు. ఇది భరించలేక బాలిక ఆత్యహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.

భార్యను గొలుసులతో బంధించారని పిటిషన్​: తన భార్యను కొందరు అక్రమంగా నిర్బంధించారని ఓ వ్యక్తి దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆమెను గొలుసులతో బంధించారని, విడిపించి తన వద్దకు తీసుకురావాలని కోరాడు. అయితే ఆ మహిళ ప్రస్తుతం ఒమన్​లో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్టేటస్​ రిపోర్ట్ దాఖలు చేయాలి కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బిహార్​కు చెందిన ఈ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం ఏప్రిల్​లో తన భార్యకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దిల్లీ పహాఢ్​గంజ్​లోని హోటల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. అయితే అది ఫేక్​ కాల్ అయి ఉంటుందని వదిలేశారు. కానీ అదే నంబర్​ నుంచి పదే పదే ఫోన్ రావడం వల్ల మళ్లీ ఓసారి మాట్లాడారు. దిల్లీకి వస్తే ఉద్యోగం ఇస్తామని, ఆ తర్వాత కొన్ని రోజులకు తనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తామని కాల్ చేసిన వాళ్లు చెప్పారని పిటిషనర్​ కోర్టుకు చెప్పాడు. మే 29న తన భార్య బిహార్ నుంచి దిల్లీకి వెళ్లిందని, పహాఢ్​గంజ్​లోని హోటల్లో ఉన్నట్టు తనకు చెప్పిందని వివరించాడు. ఆ తర్వాత ఆమె పోన్ స్విచాఫ్ అయిందని తెలిపాడు.

ఆ తర్వాత మళ్లీ జూన్​ 8న తన భార్య ఫోన్ చేసిందని, తనతో పాటు మరికొంత మంది మహిళల్ని ఓ భవనంలోని హాల్​లో గొలుసులతో కట్టి బంధించారని, రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం పెడుతున్నారని చెప్పిందని వివరించాడు. తన భార్యను వ్యభిచార గృహంలో బంధించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై జూన్ 10నే దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పాడు. ఈ ఫిర్యాదుపై ప్రభుత్వాన్ని స్టేటస్​ రిపోర్టు కోరి, తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేసింది న్యాయస్థానం.​

గ్యాంగ్​రేప్​ కేసులో నిందితులు అరెస్ట్​: జూన్​ 24న ఉత్తరాఖండ్​ రూర్కీలో తల్లికూతుళ్లపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో నలుగురు ఉత్తర్​ప్రదేశ్ చెందినవారు కాగా.. ఒక్కడు స్థానికుడు. యూపీకి చెందిన నలుగురు నిందితుల్లో ఒకరు భారతీయ కిసాన్​ యూనియన్(బీకేయూ)​ మండల ప్రధాన కార్యదర్శి. విషయం తెలిశాక బీకేయూ అతడ్ని సస్పెండ్ చేసింది.
జూన్​ 24న తల్లి, ఐదేళ్ల కూతురును కారులో ఎక్కించుకుని వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఐదుగురు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో హరిద్వార్ పోలీసులు అప్రమత్తమై ఆరు రోజుల్లో నిందితులను పట్టుకున్నారు.

ఇదీ చదవండి: బిగ్ ట్విస్ట్.. 'మహా' సీఎంగా ఏక్​నాథ్ శిందే.. ప్రభుత్వానికి దూరంగా ఫడణవీస్

Last Updated : Jun 30, 2022, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.