Threat Call to Israel Consulate: మహారాష్ట్ర ముంబయిలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఇజ్రాయెల్ కాన్సులేట్‌కు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఆ దేశంలోని బాలికలు, మహిళలపై అత్యాచారం చేస్తానంటూ దుర్భాషలాడాడు. వారిని చంపేస్తామని కూడా హెచ్చరించాడు.
సోమవారం సాయంత్రం ఈ బెదిరింపులకు సంబంధించిన కాల్ వచ్చిన తర్వాత.. పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇజ్రాయెల్ కాన్సులేట్. ఈ వ్యవహారం తీవ్రతను పరిగణనలోకి తీసుకొని వారు కేసు నమోదు చేశారు. నిందితుడు మధుర్ మోహిన్‌ను అరెస్టు చేశారు.
మధుర్ స్వస్థలం హరియాణా అని పోలీసులు తెలిపారు. అతడు గతంలో అనేక దేశాలకు వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. అతడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు వెల్లడించారు. కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: 'భారత్ నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నాం'