ETV Bharat / bharat

హోటల్​కు బాంబు బెదిరింపు కాల్​, రూ 5 కోట్లు ఇవ్వకుంటే పేల్చేస్తామంటూ - bomb threat call mumbai

Mumbai Hotel Bomb Threat మహారాష్ట్రలోని ముంబయిలో మరోసారి బాంబు కలకలం రేగింది. ముంబయి అంధేరీలోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బాంబులు పెట్టినట్లు ఆగంతుకుడి నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. రూ 5 కోట్లు ఇవ్వాలని అతడు డిమాండ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Mumbai Hotel Bomb Threat unidentified person threatens to blow up 5 Star hotel

author img

By

Published : Aug 23, 2022, 12:44 PM IST

Mumbai Hotel Bomb Threat: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇటీవల 26/11 తరహా పేలుళ్లకు పాల్పడుతామంటూ ఓ పాకిస్థాన్‌ నంబరు నుంచి పోలీసులకు మెసేజ్‌ వచ్చింది. తాజాగా మరో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. హోటల్‌లో బాంబులు అమర్చామని, రూ.5 కోట్లు ఇవ్వకపోతే పేల్చేస్తామంటూ ఆగంతుకులు ఫోన్‌ చేశారు. అయితే అది నకిలీ బెదిరింపు కాల్‌ అని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ముంబయిలోని ప్రముఖ లలిత్‌ హోటల్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి హోటల్‌లో నాలుగు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పారు. తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే హోటల్‌ను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు కాల్‌గా ధ్రువీకరించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల ముంబయి ట్రాఫిక్‌ పోలీసు హెల్ప్‌లైన్‌ నంబరుకు బెదిరింపు మెసేజ్‌లు రావడం కలకలం రేపింది. ముంబయిలో 26/11 తరహా దాడులకు పాల్పడుతామని, నగరాన్ని పేల్చివేస్తామని ఆగంతుకులు అందులో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల కోసం ఇప్పటికే కొంతమంది తమ మద్దతుదారులు భారత్‌లో పనిచేస్తున్నట్లు దుండగులు హెచ్చరించినట్లు తెలిపారు. ఆ ఫోన్‌ నంబరుకు పాకిస్థాన్‌ దేశ కోడ్‌ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు బెదిరింపులను తీవ్రంగా పరిగణించారు. తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: నిరసన చేస్తున్న విద్యార్థిని చావబాదిన ఏడీఎం, చేతిలో జెండా ఉన్నా

ముంబయికి బెదిరింపులు, ఉగ్ర దాడులు చేస్తామని పాక్​ నుంచి మెసేజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.