హనీట్రాప్ చేసి ఓ ప్రయాణికుడిని స్మగ్లింగ్‌కు పాల్పడేలా చేశారు కొందరు వ్యక్తులు. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని కొకైన్ అక్రమ రవాణా చేసేలా ప్రోత్సహించారు. ఈ స్మగ్లింగ్‌ను ముంబయి కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ముంబయి ఎయిర్‌పోర్టులో దిగిన భారత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ బ్యాగులో 2.81 కిలోల కొకైన్‌ను అతడు అక్రమంగా తీసుకొచ్చాడని అధికారులు తెలిపారు. దీని విలువ రూ.28.10 కోట్లు ఉంటుందని చెప్పారు.
స్మగ్లింగ్‌కు ప్రోత్సహించిన వ్యక్తులను నిందితుడు నేరుగా కలవలేదని అధికారులు చెప్పారు. వీరి మధ్య సోషల్ మీడియాలో మాత్రమే సంప్రదింపులు జరిగాయని తెలిపారు. డ్రగ్స్ బ్యాగ్‌ను వ్యక్తిగతంగా తీసుకురావాలని నిందితుడితో సూత్రధారులు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.