ETV Bharat / bharat

కేంద్ర మంత్రి పదవికి నఖ్వీ రాజీనామా- ఉపరాష్ట్రపతిగా అవకాశం!

Mukhtar Abbas Naqvi
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్​ నఖ్వీ రాజీనామా
author img

By

Published : Jul 6, 2022, 4:57 PM IST

Updated : Jul 6, 2022, 9:30 PM IST

16:53 July 06

కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్​ నఖ్వీ రాజీనామా

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్​సీపీ సింగ్​.. తమ పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు సమర్పించారు. బుధవారం ఉదయం జరిగిన కేబినెట్​ సమావేశంలో నఖ్వీ, ఆర్సీపీ సింగ్ దేశానికి​ చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ క్రమంలోనే ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సిఫార్సుల మేరకు.. మైనారిటీ వ్యవహారాల శాఖను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి.. స్మృతి ఇరానీకి, స్టీల్​ మంత్రిత్వ శాఖను.. ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కేటాయిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

రాజ్యసభ సభ్యునిగా నఖ్వీ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఆయనకు భాజపా మరోమారు అవకాశం ఇవ్వలేదు. సిట్టింగ్ మంత్రి పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యునిగా కాకుండా ఉండడం చరిత్రలో ఇదే తొలిసారి. ఎంపీగా లేకపోతే మంత్రిగా కొనసాగరాదన్న నిబంధన మేరకు ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. నఖ్వీ పేరును ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. రాజ్యసభ సభ్యునిగా నఖ్వీ పదవీకాలం ముగింపుతో భాజపాలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేనట్టయింది.

బిహార్​కు చెందిన​ జేడీయూ నేత ఆర్​సీపీ సింగ్​ 2021 జులై 7న మోదీ మంత్రివర్గంలో చేరారు. ఇటీవలే ప్రకటించిన రాజ్యసభ సభ్యత్వాల్లో జేడీయూ సింగ్​ పేరును ప్రకటించలేదు. కొద్దిరోజుల క్రితం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన హైదరాబాద్​ వచ్చారు. దీంతో ఆర్​సీపీ సింగ్ భాజపాలో చేరతారని అంతా భావించినా.. అలా జరగలేదు.

ఇదీ చదవండి: 'ఈ రాష్ట్రంలోనూ ఏక్​నాథ్​ శిందే పుట్టుకొస్తారు'.. భాజపా 'నాన్​సెన్స్​' జోస్యం!

Last Updated : Jul 6, 2022, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.