ETV Bharat / bharat

Mukesh Ambani Gets Death Threat : ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌.. ఈసారి రూ.200 కోట్లు డిమాండ్‌

Mukesh Ambani Gets Death Threat : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఈసారి ఆగంతకులు రూ.200 కోట్లు డిమాండ్‌ చేస్తూ మెయిల్‌ పంపించారు.

Mukesh Ambani Gets Death Threat
Mukesh Ambani Gets Death Threat
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 6:51 AM IST

Mukesh Ambani Gets Death Threat : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. తొలుత అక్టోబర్‌ 27న రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తూ బెదిరింపు మెయిల్‌ పంపిన ఆగంతకులు.. ఈసారి రూ.200 కోట్లు డిమాండ్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అసలేం జరిగిందంటే?
అక్టోబరు 27వ తేదీన అంబానీ కంపెనీకి చెందిన ఓ ఐడీకి రూ.20 కోట్లు డిమాండ్​ చేస్తూ మెయిల్​ వచ్చింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ వద్ద మంచి షూటర్లున్నారంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. వారి బెదిరింపులకు ముకేశ్ అంబానీ వైపు నుంచి స్పందన లేకపోవడం వల్ల అక్టోబరు 28న మరోసారి బెదిరింపు మెయిల్‌ను పంపించారు. మొదట పంపించిన మెయిల్‌కు స్పందించని కారణంగా రూ. 200 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని బెదిరించారు.

దీంతో ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రెండు బెదిరింపు మెయిల్స్‌ ఒకే అకౌంట్‌ నుంచి వచ్చాయని, షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని నిందితుడు బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచటం సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్‌ఐఏ అధికారులు వాజేను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.