ETV Bharat / bharat

'మహిళల పురోగతికి ఎంతో చేయాల్సి ఉంది' - అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. ప్రతి రంగంలో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. అయితే వారి భద్రత, విద్య, స్వాతంత్ర్యం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Much remains to be done to improve socio-economic status of women in India: Prez Kovind
'మహిళల సామాజిక-ఆర్థిక పురోగతికి ఎంతో చేయాల్సి ఉంది'
author img

By

Published : Mar 8, 2021, 5:46 AM IST

దేశంలో మహిళల సామాజిక ఆర్థిక స్థితిగతులు మారడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

"అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. కుటుంబం, సమాజం, దేశానికి వారు స్ఫూర్తిదాయకం. భారత్​లో ప్రతి రంగంలో మహిళలు తమదైన ముద్ర వేశారు. విశిష్ట పాత్రతో దేశ ప్రగతికి గణనీయమైన కృషి చేశారు. అయితే, దేశంలో మహిళల సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి ఇంకా ఎంతో చేయాల్సిఉంది. వారి భద్రత, విద్య, స్వాతంత్ర్యం కోసం మనందరం అవిరామంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే అతివలు, ముఖ్యంగా మన కూతుళ్లు.. మరింత శక్తిమంతంగా, సమర్థవంతంగా తయారై, సాధికారత సాధించేందుకు వీలవుతుంది."

-రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి

ఈ మహిళా దినోత్సవాన్ని.. అతివల భద్రత, సాధికారత కోసం అంకితమివ్వాలని కోవింద్ పిలుపునిచ్చారు. వారి పురోగతికి ఆటంకం కలిగించే ప్రతి సంప్రదాయం, విధానాన్ని మార్చడంలో మద్దతుగా నిలుస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: గిరిజనులలో లింగవివక్ష లేదు: రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.