ETV Bharat / bharat

MS Swaminathan Biography : 'దేశం ఓ కుమారుణ్ని కోల్పోయింది'.. ఎంఎస్ స్వామినాథన్​కు ప్రముఖుల నివాళి - ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవం

MS Swaminathan Biography : హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ కన్నుమూశారు. ఆహార కొరత నుంచి.. స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం తీసుకున్న అనేక నిర్ణయాల్లో పాత్ర వహించిన స్వామినాథన్‌ 98 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. స్వామినాథన్ మృతి పట్ల దేశంలోని ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

MS Swaminathan Biography
MS Swaminathan Biography
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 6:54 PM IST

MS Swaminathan Biography : హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు. 98 ఏళ్ల స్వామినాథన్‌ (MS Swaminathan Age) చెన్నైలో గురువారం ఉదయం 11 గంటలకు కన్నుమూశారు. వయసు అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. స్వామినాథన్ మృతి పట్ల దేశంలోని ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికారిక లాంఛనాలతో స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

దేశం ఓ కుమారుడిని కోల్పోయింది : వెంకయ్య నాయుడు
వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వ పరమైన విధానాల్లో కీలక మార్పులకు స్వామినాథన్ కారణమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఈ రోజు దేశం ఓ కుమారుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ను తనలానే లక్షలాది మంది ఆరాధిస్తారని చెప్పారు. చెన్నైలో స్వామినాథన్ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాను వ్యవసాయ నేపథ‌్యమున్న కుటుంబం నుంచి వచ్చినందున స్వామినాథన్‌ను ఈ రంగానికి సంబంధించి పలు సమస్యలను అడిగి తెలుసుకునేవారినని చెప్పారు. రాజ్యసభలో స్వామినాథన్ ప్రసంగాన్ని సభ్యులంతా ఎంతో ఆసక్తిగా వినేవారని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు.

"స్వామినాథన్ మరణ నన్ను బాధిస్తోంది. ఆయన కుటంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. స్వామినాథన్ ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపారు. వ్యవసాయ రంగానికి పితామహుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ద్వారా కేంద్రం పలు సంస్కరణలు తీసుకురావడానికి ఆయన బాధ్యుడు. ఆయన కారణంగా వచ్చిన సంస్కరణలు.. వ్యవసాయం రంగంలో పనిచేసే వారికి ఓ మార్గదర్శిలాంటివి"
--వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి

  • Paid my respectful homage to the mortal remains of legendary agricultural scientist, Prof. MS Swaminathan, at his residence in Chennai today.
    May his atma attain sadgati! Om Shanti!@msswaminathan pic.twitter.com/l5azO9XXN7

    — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ సంతాపం..
అంతకుముందు.. ఎంఎస్​ స్వామినాథన్​ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. స్వామినాథన్​తో దిగిన ఫొటోలను ఎక్స్​(ట్విట్టర్​)లో షేర్​ చేసి సంతాపం తెలిపారు. "డాక్టర్ ఎంఎస్​ స్వామినాథన్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మన దేశం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు.. వ్యవసాయంలో ఆయన చేసిన సంచలనాత్మక కృషి లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది. దేశానికి ఆహార భద్రతను కల్పించింది" అని ఆయన సేవలను మోదీ కొనియాడారు.

  • Beyond his revolutionary contributions to agriculture, Dr. Swaminathan was a powerhouse of innovation and a nurturing mentor to many. His unwavering commitment to research and mentorship has left an indelible mark on countless scientists and innovators.

    — Narendra Modi (@narendramodi) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I will always cherish my conversations with Dr. Swaminathan. His passion to see India progress was exemplary.
    His life and work will inspire generations to come. Condolences to his family and admirers. Om Shanti.

ఆ సంఘటనతో చలించి..
MS Swaminathan Passed Away : ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలు సృష్టించారు. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో చదివారు. తరువాత కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.

తండ్రి వైద్యుడు కావడం వల్ల మెడికల్ పాఠశాలలో చేరిన స్వామినాథన్‌.. 1943 నాటి భయంకరమైన బంగాల్ కరవును చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలిని నుంచి కాపాడాలనే లక్ష్యంతో.. వైద్య రంగం నుంచి వ్యవసాయ రంగానికి మారిపోయారు. త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో చేరి బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. 1949లో దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనాసంస్థ నుంచి సైటోజెనెటిక్స్‌లో పీజీ చేశారు.

యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళాదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. సోలానమ్ విస్తృతమైన అడవి జాతుల నుంచి బంగాళాదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో.. ఆయన విజయం సాధించారు. 1950లో కేంబ్రిడ్జ్ వర్శిటీకి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి PHD చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద.. పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో భారతదేశానికి తిరిగి వచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు చేశారు.

వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా స్వామినాథన్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆకలి, పేదరికం తగ్గించడంపై స్వామినాథన్ ప్రధానంగా దృష్టి పెట్టి వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఆయన చేసిన పరిశోధన వల్ల భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.

స్వామినాథన్ ఎన్నోపదవులను సమర్థంగా నిర్వహించారు. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరక్టర్‌గా పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరక్టరు జనరల్‌గా సేవలనందించారు. 1988లో 'ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్' సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థల్లోనూ.. పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైమ్20"లో ఆయన పేరును టైమ్‌ మ్యాగజైన్ ప్రచురించింది.

స్వామినాథన్ అవార్డులు..
MS Swaminathan Awards : వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యుత్తమ పురస్కారాలను అందించింది. 1989లో పద్మవిభూషణ్‌ అవార్డును.. ఆయన అందుకున్నారు. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్‌ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. 1971లో రామన్‌ మెగసెసే అవార్డును ఆయన అందుకున్నారు. 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డు స్వామినాథన్‌ను వరించింది. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని స్వామినాథన్ అందుకున్నారు.

MS Swaminathan Passed Away : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్​ స్వామినాథన్​ కన్నుమూత

'వ్యవసాయం జీవించాలంటే సతతహరిత విప్లవం రావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.