ETV Bharat / bharat

మామిడి పండు అ'ధర'హో- కేజీ రూ.2లక్షలు

మామిడి పండు కేజీ ధర ఎంత ఉంటుంది? డిమాండ్​తోపాటు రకాలను బట్టి రూ. 1000లోపే ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో పరిహార్​ దంపతులు సాగు చేస్తున్న మామిడి పండ్ల కేజీ ధర రికార్డ్​ స్థాయిలో సుమారు రూ. రెండు లక్షల వరకు పలుకుతోంది. జపాన్​లో ఎక్కువగా పండించే 'టాయో నో టామ్​గావ్​' రకం మామిడిని సాగు చేస్తూ.. వారు లాభాలను గడిస్తున్నారు.

world most expensive mango, ప్రపంచంలోనే ఖరీదైన మ్యాంగో
ఈ మామిడి పండ్లు కేజీ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
author img

By

Published : Jun 8, 2021, 4:56 PM IST

ప్రపంచవ్యాప్తంగా మామిడి పండుకు ఎంతో ఆదరణ ఉంది. అందుకే దీనిని అన్ని ఫలాలకు రారాజుగా అని పిలుస్తారు. మామిడిలో వివిధ రకాల ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో సంకల్ప్​, రాణి పరిహార్​ దంపతులు పండించే మామిడి పండ్లు కేజీ సుమారు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ధర పలుకుతాయి. జపాన్​లో ఎక్కువగా పండించే 'టాయో నో టామ్​గావ్​' రకానికి చెందిన మామిడి పండ్లను ప్రస్తుతం పరిహార్​ దంపతులు సాగు చేస్తున్నారు.

జబల్​పుర్​లోని చార్​గ్వన్​ రోడ్డు ప్రాంతంలో ఉన్న పరిహార్​ దంపతుల గార్డెన్​లో సుమారు 14 రకాల మామిడి పండ్లు దర్శనమిస్తాయి. ఈ సాగును వీరు గత నాలుగేళ్లగా చేస్తున్నారు. 'టాయో నో టామ్​గావ్​' రకానికి చెందిన ఈ చెట్లల్లో ఒక్కో చెట్టుకు 20 పండ్లు కాస్తాయని రాణి పరిహార్​ తెలిపారు.

world most expensive mango, ప్రపంచంలోనే ఖరీదైన మ్యాంగో
పరిహార్​ దంపతుల తోటలోని మామిడి పండ్లు

'టాయో నో టామ్​గావ్​' రకం మామిడి పండ్లు

"ఈ సాగు చేయడానికి చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. తక్కువ దిగుబడి ఉండటం వల్ల మొదట దీని కొనుగోలుకు ఎవరూ మొగ్గు చూపేవారు కాదు. కానీ క్రమంగా దీనికి డిమాండ్​ పెరిగింది. జపాన్​లో ఈ పండ్లను బహిరంగ ప్రదేశాల్లో పండించరు. కానీ భారత్​లో బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసేందుకు కూడా వాతావరణం అనుకూలంగా ఉంది. వీటిలో ఎలాంటి పీచు పదార్థం ఉండటమే కాక పండు కూడా చాలా రుచిగా ఉంటుంది."

-రాణి పరిహార్​

2కేజీల మామిడి పండు..

జపాన్​లో పండించే వివిధ రకాల మామిడి పండ్లను పరిహార్​ దంపతులు సాగు చేస్తున్నారు. వీటిలో కొన్ని మామిడి పండ్లు పర్పుల్​, పింక్​ రంగుల్లో పండుతాయి.

పరిహార్​ దంపతుల తోట

వీరి తోటలో ఉన్న మరో ఆకర్షణ 2కేజీ మ్యాంగో. ఈ రకం మామిడి పండ్లు బాగా పండితే రెండు కేజీల బరువు ఉంటాయి. వీటితో పాటు అల్ఫోన్సో, నూర్​ జహాన్, మల్లికా, దశరా మామిడి పండ్లను కూడా పరిహార్​ దంపతులు పండిస్తున్నారు.

'ప్రభుత్వం ప్రోత్సహిస్తే..'

తమ సాగు లాభసాటిగా ఉన్నా.. హార్టికల్చర్​ శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టట్లేదని సంకల్ప్​ పరిహార్​ అంటున్నారు. దీని ఫలితంగా ఈ ఉత్పత్తులు చిరు రైతులకు చేరట్లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ ప్రాంతంలోని పేద రైతుల పరిస్థితి మారుతుందని సంకల్ప్ అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి : ఆ మామిడి పండ్లు తినాలంటే ఆస్తులమ్ముకోవాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.