ETV Bharat / bharat

ఆటోలో నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లిన కోతి - కోతి వార్తలు

కోతి చేసిన పనికి ఓ వ్యక్తి భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఆటోలో నుంచి లక్ష రూపాయలతో ఉన్న టవల్​ను ఎత్తుకెళ్లి.. సమీప ప్రాంతంలో కరెన్సీ నోట్లు వెదజల్లింది ఆ వానరం. ఈ సంఘటన మధ్యప్రదేశ్​ జబల్​పుర్​ జిల్లా కటవ్​ ఘాట్​ ప్రాంతంలో జరిగింది.

Wild monkey
ఆటోలో నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లిన కోతి!
author img

By

Published : Oct 3, 2021, 6:39 PM IST

ట్రాఫిక్​ జామ్​లో నిలిచిపోయిన ఓ ఆటోలో నుంచి లక్ష రూపాయలతో ఉన్న టవల్​ను ఎత్తుకెళ్లింది ఓ కోతి. దూరంగా తీసుకెళ్లి కరెన్సీ నోట్లను వెదజల్లింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్​ జబల్​పుర్​ జిల్లాలో జరిగింది.

కటాంగి గ్రామానికి చెందిన మహమ్మద్​ అలీ అనే వ్యక్తి.. సెప్టెంబర్​ 30న తన టవల్​లో రూ.లక్ష మూటగట్టుకుని మరో ఇద్దరితో కలిసి ఆటో ఎక్కాడు. జిల్లాలోని కటవ్​ ఘాట్​ ప్రాంతంలో ఉన్న ఇరుకు దారిలోకి రాగానే.. ట్రాఫిక్​లో చిక్కుకుపోయింది ఆటో. వాహనాలు నిలిచిపోయేందుకు కారణం తెలుసుకోవాలని ఆటోలోంచి ముగ్గురు కిందకు దిగారు. అప్పుడే.. వెనక నుంచి వచ్చిన ఓ కోతి.. లక్ష రూపాయలు మూటకట్టిన టవల్​ను ఎత్తుకెళ్లింది. సమీపంలోని ఓ పెద్ద చెట్టు ఎక్కి.. టవల్​ను చింపివేయటం వల్ల.. కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ చెల్లాచెదురుగా పడ్డాయి. కోతిని చూసుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చిన బాధితుడు.. నోట్లను పోగు చేసేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయినప్పటికీ.. మొత్తం నగదును సేకరించలేకపోయాడు. రూ.56 వేలు మాత్రమే దొరికాయి. మిగిలినవి ఎవరు తీసుకున్నారో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. కోతి ఎత్తుకెళ్లి పడేసినందున ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపాడు.

నిజంగానే కోతి ఎత్తుకెళ్లిందా అని తెలుసుకునేందుకు ఆటో నిలిచిపోయిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు సైతం లేవని మాజ్​హోలీ పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జ్​ సచిన్​ సింగ్​ తెలిపారు. ఆ ప్రాంతంలో చాలా మంది కోతులను పెంచుతారని, వాహనాల్లోకి వానరాలు చొరబడిన సందర్భాలు చాలానే ఉన్నాయని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: దారుణం.. ఆరేళ్ల బాలుడ్ని సుత్తితో కొట్టి చంపిన బంధువులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.